మధ్యాహ్నం అన్నానికి బదులు వీటిని తింటే తొందరగా బరువు తగ్గుతరు

First Published | Sep 16, 2023, 1:47 PM IST

అన్నంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు అన్నాన్ని తక్కువగా తినాలి. వెయిట్ లాస్ కావాలనుకుంటే మధ్యాహ్నం అన్నానికి బదులుగా వేరే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 

belly fat loss

బరువు తగ్గడానికి, పొట్టను కరిగించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. అలాగే శారీరక శ్రమలో కూడా ఖచ్చితంగా పాల్గొనాలి. అయితే బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని వీలైనంత తక్కువగా తినాలి. ఎందుకంటే అన్నంలో కార్భోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బరువును మరింత పెంచుతాయి.  అందుకే బరువు తగ్గాలనుకునేవారు అన్నాన్ని తక్కువగా తినాలి. అయితే మధ్యాహ్నం పూట అన్నానికి బదులుగా  కొన్ని ఆహారాలను తింటే సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

belly fat

బార్లీ

బార్లీలో బియ్యం కంటే ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. బార్లీలో విటమిన్ బి, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలంటే బార్లీ రైస్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఓట్స్

ఓట్స్ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఓట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే మధ్యాహ్నం ఓట్ మీల్ ను తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. 
 

కూరగాయల సలాడ్

కూరగాయల సలాడ్ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి మధ్యాహ్నం పూట పండ్లు లేదా కూరగాయల సలాడ్ ను తినండి. 
 

గింజలు

గింజలు పోషకాలకు మంచి వనరు. ఫైబర్ ఎక్కువగా ఉండే నట్స్ బరువు తగ్గడానికి, అపానవాయువును తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. గింజలను తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉండదు. అందుకే బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి గింజలను మధ్యాహ్నం, రాత్రి పూట తీసుకోండి. 

Latest Videos

click me!