పల్లీలను రోజూ తింటే ఇన్ని ప్రయోజనాలా?

First Published | Sep 14, 2023, 2:33 PM IST

పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ మోతాదులో వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

వేరుశనగ దినోత్సవం ప్రతి ఏడాది సెప్టెంబర్ 13 న జరుపుకుంటారు. కాగా వేరుశెనగ గింజలు పోషకాలకు మంచి వనరు. పల్లీల్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఇతర ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 
 

పల్లీల్లో బయోటిన్,  విటమిన్ ఇ, కాపర్, మాంగనీస్, ఫోలేట్, థయామిన్, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాగా పల్లీల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తింటే బరువు పెరుగిపోతామన్న భయం ఉండదు. కాగా పల్లీల్లో ఫైబర్, ప్రోటీన్, కొవ్వు లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే పల్లీలు మీ బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఎలా అంటే వీటిని తింటే ఆకలి తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి గొప్ప చిరుతిండి. 100 గ్రాముల పల్లీల్లో 25.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.


నిశ్చల జీవనశైలి మీ గుండె ఆరోగ్యాన్ని  దెబ్బతీస్తుంది. అలాగే గుండెపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా బాగా పెంచుతుంది.  అయితే వేరుశెనగలు మీ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. 0వివిధ అధ్యయనాల ప్రకారం.. పల్లీలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తాయో కూడా వెల్లడించాయి. పల్లీలను మితంగా తీసుకుంటే అధిక కొవ్వు ఉన్నప్పటికీ ఇవి మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. పిల్లలకు పల్లీలను పౌడర్ లేదా వేరుశెనగ వెన్నగా ఇవ్వడం వల్ల అలెర్జీలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
 

peanuts

పల్లీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎఫెక్టీగా పనిచేస్తుంది. పల్లీల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి మన మొత్తం శరీరం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీలను తింటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

Latest Videos

click me!