మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి రోజూ తింటే ఏమౌతుంది..?

First Published Jul 3, 2024, 10:18 AM IST

మల్టీ గ్రెయిన్స్ తో తయారు చేసిన గోధుమ పిండిని  వాడుతూ ఉంటారు. ఇది అయితే.. కాస్త ఆరోగ్యానికి మంచిది కదా అని భావిస్తారు. మరి ఇది ఎంత వరకు నిజం..?

గోధుమ పిండిని మనం రెగ్యులర్ గా మన ఆహారంలో భాగంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా చపాతీ, రోటీలు చేసుకుంటూ ఉంటాం. కొందరు మాత్రం... జస్ట్ గోధుమ పిండి ఎందుకులే అని...  మల్టీ గ్రెయిన్స్ తో తయారు చేసిన గోధుమ పిండిని  వాడుతూ ఉంటారు. ఇది అయితే.. కాస్త ఆరోగ్యానికి మంచిది కదా అని భావిస్తారు. మరి ఇది ఎంత వరకు నిజం..? రోజూ మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

మీరు కనుక మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి ని వాడుతున్నట్లయితే.... ఎలాంటి భయం లేకుండా రోజూ తినొచ్చు. ఎందుకంటే.. దీనిలో చాలా న్యూట్రియంట్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.  మరి రోజూ ఈ పిండి తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..

మల్టీ గ్రెయిన్ లో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ మల్టీ గ్రెయిన్ గోధుమ పిండిలో.. చాలా రకాల గ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి.... ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, గట్ హెల్త్ ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

అంతేకాదు.. ఈ మల్టీ గ్రెయిన్ గోధుమ పిండిలో ఫైబర్ తో పాటు.. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పిండితో చేసిన రోటీలను రోజూ తినడం వల్ల.. శరీరంలో బ్యాడ్ కొలిస్ట్రాల్ ని పూర్తిగా తగ్గించడంలో సహాయపడుతుంది.

అంతేకాదు...షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.  షుగర్ పేషెంట్స్ కూడా  ఈ మల్టీ గ్రెయిన్ గోధుమ పిండిని హ్యాపీగా తినొచ్చు.  ఎందుకంటే వీటిలో.. కార్బ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.  టైప్ 2 డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది.

బరువును కంట్రోల్ లో ఉంచుకోవడానికి,  ముఖ్యంగా బరువు తగ్గడానికి.. మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి తో చేసిన రోటీ తింటే సరిపోతుంది.  ఇది అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది. కాబట్టి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ghee on roti

దీనిలో  యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. రోనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.  ఇన్ఫెక్షన్స్ మన శరీరానికి దరి చేరకుండా కాపాడటంలో...  ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది.

అది మాత్రమేకాదు.. మన చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయ పడుతుంది. చర్మం సాగిపోయినట్లుగా కాకుండా... ముడతలు రాకుండా కాపాడటంతోపాటు...  చర్మం మెరుస్తూ కనపడేలా చేస్తుంది.
 

Latest Videos

click me!