డ్రై ఫ్రూట్స్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు..? ఈవెనింగ్ స్నాక్స్ గా ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే... డ్రై ఫ్రూట్స్ అనగానే అందరికీ జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ లు మాత్రమే గుర్తుకువస్తాయి. పిస్తా పప్పును దాదాపు అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ... ఈ పిస్తా పప్పులు రోజూ మన డైట్ లో భాగం చేసుకుంటే.. చాలా అద్భుతాలు జరుగుతాయట.
అది కూడా.. ఒకటో రెండో కాకుండా.. రోజూ మర్చిపోకుండా లెక్క పెట్టి... 12 పిస్తా పప్పులను తింటే... మన శరీరంలో జరిగే మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
pista
పిస్తా పప్పు లు రుచి చాలా బాగుంటుంది. అయితే.. రుచి మాత్రమే కాదు పిస్తా న్యూట్రియంట్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. రోజూ 12 పప్పులను తినడం వల్ల.. మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. చిన్నగా ఉండే ఈ పిస్తా పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అంతేకాదు... విటమిన్ బి6 కూడా పుష్కలంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సహాయపడతాయి. ఈ పప్పుల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
పిస్తా పప్పుల్లో చాలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ముఖ్యంగా మెనోశాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్యాట్స్... మన శరీరంలో చెడు కొలిస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీరు నమ్ముతారో లేదో.. మీరు రోజూ 12 పిస్తా పప్పులను తినడం వల్ల బరువు అతిగా పెరగకుండా కంట్రోల్ లో ఉంటుందట. ఎందుకంటే... వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని 12 తినడం వల్ల.. మనకు కడుపు కాస్త నిండిన అనుభూతి కలుగుతుంది. ఇతర ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. క్యాలరీ ఇన్ టేక్ తక్కువగా ఉండటం వల్ల... అతిగా బరువు పెరిగే అవకాశమే ఉండదు.
అంతేకాదు.. షుగర్ పేషెంట్స్ కి కూడా పిస్తా పప్పులు చాలా మేలు చేస్తాయి. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల... బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి భయం లేకుండా వీటిని ఆస్వాదించవచ్చు.
మనం వీటిని పిల్లల డైట్ లోనూ భాగం చేయవచ్చు. ఈ రోజుల్లో పిల్లలలకు చిన్న వయసులోనే కళ్ల జోళ్లు వచ్చేస్తున్నాయి. అందుకే.. వారికి వీటిని పెట్టడం వల్ల.. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు మాత్రమే కాదు.. పెద్దవారికి వయసు రిత్యా వచ్చే కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఎవరైనా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. వాళ్లు కూడా.. కచ్చితంగా వీటిని తమ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే. ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంలో సహాయపడతాయి. పిస్తా పప్పులు.. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. మలబద్దకం సమస్య అనేది ఉండదు.