ఈ ట్రిక్ తో,.. కూరగాయల ధర ఎంత పెరిగినా..మీ జేబుకు చిల్లు పడదు..!

First Published | Jun 21, 2024, 10:59 AM IST

మీరు చదివింది నిజమే.. కూరగాయలను ఎండ పెట్టి.. వర్షాకాలంలో ఎలా వాడుకోవచ్చు.. అన్నీ కాకపోయినా.. కొన్నింటిని అయితే ఇలా ఉపయోగించవచ్చు.

వర్షాకాలం వచ్చింది అంటే.. కాస్త ఉపశమనం కలుగుతుంది. అప్పటి వరకు  మండే ఎండల తాలుకా ప్రభావం తగ్గుతుంది. వాతావరణం చల్లగా మారడంతో.. హాయి అనుభూతి కలిగిస్తుంది.  కానీ.. ఈ వర్షాకాలంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పటి వరకు కేజీ రూ.20 అమ్మిట టమాట ధర ఒకేసారి రూ.100కు ఎగబాకుతుంది. అక్కడితో ఆగదు.. రూ.200 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ధరలను చూసి కూరగాయలు కొనాలి అంటే భయం వేస్తూ ఉంటుంది. అలా అని.. తినకుండా ఉండలేం కదా.. ఎంత అంటే.. అంత పెట్టి కొనకతప్పదు. అయితే... మీరు ధరలు పెరగకముందే కొన్ని చిట్కాలు ఫాలో అయితే... తర్వాత ఎంత ధర పెరిగినా మీకు భయం ఉండదు. మీ జేబులు కూడా ఖాళీ అవ్వవు. మరి దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

Leafy vegetables

కొందరు నిల్వ పచ్చళ్లు పెట్టుకునేటప్పుడు అంటే.. టమాట, మామిడికాయ పచ్చళ్లను పెట్టేముందు.. ముక్కలు కోసి ఎండపెడతారు. అలా చేస్తే.. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని నమ్ముతారు. ఇదే పద్దతిలో మనం కూరగాయల ధరలు తక్కుగా ఉన్న సమయంలోనే వాటిని కోసి ముక్కలుగా చేసి.. ఎండపెట్టుకుంటే.. తర్వాత వర్షాకాలం మొత్తం వాడుకోవచ్చు. మీరు చదివింది నిజమే.. కూరగాయలను ఎండ పెట్టి.. వర్షాకాలంలో ఎలా వాడుకోవచ్చు.. అన్నీ కాకపోయినా.. కొన్నింటిని అయితే ఇలా ఉపయోగించవచ్చు.


తక్కువ ధరలో ఉన్నప్పుడే కొన్ని కూరగాయలను కాస్త ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలి.మీరు ఎండిన కూరగాయలను వర్షాకాలంలో తినవచ్చు. అలాంటప్పుడు బెండకాయను ముక్కలుగా కోసి ఎండలో ఆరబెట్టాలి. వంకాయ ఎండలో బాగా ఆరిపోయినప్పుడు, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. వాటిని వంట చేయడానికి ముందు మాత్రం  వేడి నీళ్లలో వేసి మరిగించాలి. అప్పుడు అవి మళ్లీ తాజా కూరగాయల్లా మారతాయి. తర్వాత హ్యాపీగా కూర చేసుకోవచ్చు. కూరగాయలా వాడండి.
 


వర్షాకాలంలో టమాటా ధరలు తరచుగా పెరుగుతాయి, కాబట్టి మీరు తక్కువ ధరకు టమోటాలు (టమోటా రకాలు) పొందినప్పుడు, టమోటాలను గుండ్రంగా లేదా పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఎండలో ఉంచండి. టొమాటో ఎండినప్పుడు, మీరు దానిని పొడిగా లేదా కూరగాయలలో చిన్న ముక్కలుగా చూర్ణం చేయడం ద్వారా ఉపయోగించవచ్చు.

మీరు మామిడికాయలను ఎండబెట్టి, కూరగాయలలో కూడా ఉపయోగించవచ్చు. మామిడికాయను తొక్క తీసి కోసి, గింజలను వేరు చేసి ఎండలో ఆరబెట్టాలి. మామిడికాయ ఎండలో బాగా ఆరిపోయాక కాస్త ఉప్పు వేసి స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. కూరల్లో, పప్పులో వేసుకోవచ్చు. 

క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ ని కూడా ఇదేవిధంగా వాడొచ్చు.
మీరు కాలీఫ్లవర్‌ను ఎండబెట్టి, వర్షాకాలంలో రుచికరమైన కూరగాయగా కూడా తినవచ్చు. కాలీఫ్లవర్‌ , క్యాబేజీ ను కడగాలి కొమ్మను వేరు చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరనివ్వండి. కాలీఫ్లవర్, క్యాబేజీ  ఆరిపోయాక, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేయాలి. మీరు కూర చేసుకోవడానికి ముందు.. బాగా మరిగిన నీటిలో పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది. తాజాగా మారిపోతాయి.. కూర చేసుకోవచ్చు. 

Latest Videos

click me!