శరీరంలో కొలిస్ట్రాల్ పెరిగిపోయిందా..? ఈ గింజలు కరిగించేస్తాయి..!

First Published | Jun 20, 2024, 9:59 AM IST

అధిక కొలిస్ట్రాల్ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా.. కేవలం మీ డైట్ లో కొన్ని గింజలను చేర్చుకుంటే సరిపోతుంది. ఆ గింజలు మరేంటో కాదు.. చియా సీడ్స్.
 

cholesterol

ఈ రోజుల్లో చాలా మంది శరీరంలో కొలిస్ట్రాల్ పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది అని రెగ్యులర్ బాడీ చెకప్ టెస్టులు చేయిస్తే.. కొలిస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ లో వస్తోంది. లావు, సన్నం అనే తేడా లేకుండా.. అందరినీ ఈ సమస్య వేధిస్తోంది. అధిక కొలిస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం మంచిది కాదు. ఇది మనకు తెలీకుండానే గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది.

గుండె గోడల్లో కొలిస్ట్రాల్ పేరుకుపోయి.. గుండెకు, మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగదు.  అలాంటి సమయంలో కొలిస్ట్రాల్ నియంత్రించడం చాలా ముఖ్యం. కొలిస్ట్రాల్ నియత్రించడానికి ఏం చేయాలా అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే.. టెన్షన్ లేకుండా.. అధిక కొలిస్ట్రాల్ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా.. కేవలం మీ డైట్ లో కొన్ని గింజలను చేర్చుకుంటే సరిపోతుంది. ఆ గింజలు మరేంటో కాదు.. చియా సీడ్స్.
 


chia seed

మీరు చదివింది నిజమే.. చియా సీడ్స్ ని మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల... కొలిస్ట్రాల్ ని ఇట్టే కరిగించవచ్చు. ఈ విషయాన్ని నిపుణులే స్వయంగా చెబుతున్నారు.  ఈ చియా సీడ్స్ ని.. మన డైట్ లో ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవాలి. దీనితోపాటు.. ఆరోగ్యకరమైన జీవన శైలిని కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు కొలిస్ట్రాల్ కరిగిపోతుంది.  వాస్తవానికి, చియా విత్తనాలను నానబెట్టినప్పుడు, దాని నుండి జెల్లీ లాంటి సమ్మేళనం ఏర్పడుతుంది, ఈ జెల్లీ సిరల్లో కూర్చున్న కొలెస్ట్రాల్‌ను శుభ్రపరుస్తుంది.

చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి మీ రక్తంలో HDL కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచుతాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. చియా సీడ్స్ లో.. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థలో ఉన్న కొలిస్ట్రాల్ ని కూడా కరిగించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహంలోని దాని శోషణను నిరోధిస్తుంది.   చెడు కొలిస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
 

Latest Videos

click me!