విటమిన్ సి , ఐరన్ పుష్కలంగా ఉండే అరటిపండ్లు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారిస్తాయి. పొటాషియం ,ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న అరటిపండ్లు రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
నేరేడు పండులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.