Food Storage Tips: ఇంట్లో నెలకు సరిపడా గ్రోసరీస్ తెచ్చుకుంటాం. అందులో పప్పులు అయితే కంటైనర్ డబ్బాల్లో వేసినా కూడా పురుగులు పట్టేస్తుంటాయి. వాటిలోపల గుల్ల చేయడంతో పడేయాల్సి ఉంటుంది. పప్పులు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ కిచెన్ టిప్ ట్రై చేయండి.
బియ్యానికి పురుగు పడుతుందని తెలుసు. కానీ పప్పుల గురించి పెద్దగా పట్టించుకోం. పప్పు దినుసులను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటికి కూడా పురుగులు పట్టేస్తాయి. ముఖ్యంగా ఎర్ర కందిపప్పుకే ఈ సమస్య. అయితే ఒక్క స్పూన్ ఉప్పుతో పురుగులు పట్టకుండా చేయొచ్చు.
25
ఉప్పును వాడే సరైన పద్ధతి
పప్పులను డబ్బాలో నింపే ముందు వాటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు సహజంగా తేమను తగ్గించే లక్షణం కలిగి ఉండటం వల్ల పప్పుల్లో తడి చేరకుండా సహాయపడుతుంది. దాంతో పురుగు పట్టదు. ఇది పూర్తిగా సహజమైన పద్ధతి కావడంతో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ కాలం పప్పులు నిల్వ చేసుకునే వారికి ఇది మంచి ఆప్షన్. పప్పులను ఎండలో ఉంచి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ చిన్న చిట్కా పాటిస్తే పప్పులు ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉంటాయి.
35
ఉప్పు ఎలా పనిచేస్తుంది?
ఉప్పు పప్పులోని తేమను పీల్చుకుంటుంది. పురుగులు పెరగడానికి తేమ చాలా అవసరం. ఉప్పు కలపడం వల్ల పప్పు పొడిగా (Dry) ఉంటుంది. దీంతో పురుగులు అక్కడ బతకలేవు.
ఉప్పు కలిపిన పప్పులను తప్పనిసరిగా గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి. ఎందుకంటే గాలి తగిలినప్పుడు వాతావరణంలో ఉన్న తేమ పప్పులోకి చేరి తడి అంటుకుంటుంది. తేమ చేరితే పప్పులు త్వరగా పాడైపోతాయి. కాబట్టి, పప్పులను ముందుగా బాగా ఎండబెట్టి, ఉప్పు కలిపిన తర్వాత పూర్తిగా పొడిగా ఉన్న, గాలి రాని డబ్బాలోనే ఉంచడం మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
55
ఎండలో ఆరబెట్టాలి
పప్పుల డబ్బాను గ్యాస్ స్టవ్ దగ్గర లేదా వేడిగా ఉండే చోట పెట్టొద్దు. చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి. పప్పులను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ తేమగా అనిపించినా, చిన్న పురుగులు కనిపించినా వెంటనే ఎండలో ఆరబెట్టండి. ఇలా చేస్తే పురుగులు, తేమ రెండూ పోతాయి.