మిగిలిపోయిన పూరీలు మెత్తగా ఉండాలంటే ఇలా చేయండి..

First Published | Aug 8, 2024, 9:55 AM IST

పూరీలను అప్పటికప్పుడు చేసుకుని తింటే మెత్తగా ఉంటాయి. ఉదయానికల్లా ఇవి గట్టిగా రొట్టెల్లా అవుతాయి. అయితే గట్టి పడిన పూరీలను మీరు మెత్తగా చేసి తినొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

poori

నిజంగా వంట చేయడమొక కళ. అలాగే చపాతీలు, పూరీలను తయారు చేసే కళ అందరికీ ఉండదు. కొంతమంది చపాతీలను కానీ, పూరీలను గానీ చాలా సాఫ్ట్ గా, మెత్తగా చేస్తారు. కానీ కొంతమంది చేస్తే గట్టిగా, కఠినంగా వస్తాయి. అంతా బానే చేశాను ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తుంటారు. నిజానికి పిండి సరిగ్గా కలపకపోవడం వల్లే చపాతీలు, పూరీలు మెత్తగా రావు. పిండిని బాగా కలిపితే చపాతీలు, పూరీలు చాలా సాఫ్ట్ గా, మెత్తగా వస్తాయి.

అయితే చాలా సార్లు పూరీలు మిగిలిపోతుంటాయి. ఇవి తొందరగా పాడవవు కాబట్టి తర్వాతి రోజు తింటుంటారు. కానీ తర్వాత రోజుకు పూరీలు గట్టిపడతాయి. ఇంకేముందు ఇవి తినడానికి పనికి రావని కొంతమంది డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో గట్టిపడిన పూరీలను తిరిగి మెత్తగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఆవిరిలో.. 

గట్టిపడిన పూరీలను మెత్తగా  చేయడానికి ఆవిరి పద్దతి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల పూరీలు చాలా మృదువుగా మారడమే కాకుండా.. టేస్ట్ కూడా బాగుంటాయి. దీనికోసం ఒక లోతైన పాత్రను తీసుకుని అందులో కొన్ని నీళ్లను వేడి చేయండి. దీనిపై ఒక స్ట్రెయినర్ ను ఉంచండి. దీనిలో గట్టిపడిన పూరీలను పెట్టి దానిపై మూత పెట్టండి.  ఆవిరిలో 5-10 నిమిషాలు పూరీలను ఉండనివ్వండి. దీనివల్ల పూరీలకు తేమ తగిలి అవి తిరిగి మెత్తగా మారుతాయి. అయితే వేడి చేసిన తర్వాత పూరీలను కాసేపు గాలిలో ఉంచితే దాని తడి బయటకు వస్తుంది. తర్వాత ఎంచక్కా తినొచ్చు. 
 


మైక్రోవేవ్ లో.. 

గట్టిపడిని పూరీలను మెత్తగా చేయడానికి మీరు మైక్రోవేవ్ ను కూడా ఉపయోగించొచ్చు. దీని కోసం మిగిలిపోయిన పూరీలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి. తర్వాత పూరీలపై కొంచెం తడిపిన కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్ ను పెట్టండి. అయితే ఈ టవల్ శుభ్రంగా, కొత్తగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మైక్రోవేవ్ లో 20-30 సెకన్ల పాటు వేడి చేయండి. తడి టవల్ పూరీలలో తేమను నిలుపుకుంటుంది. అలాగే వాటిని మెత్తగా చేస్తుంది. దీని తర్వాత కూడా అన్ని పూరీలు మెత్తగా కాకపోతే.. మళ్లీ ఒకసారి ఈ పద్దతిని అవ్వండి. ఇది పూరీలను ఖచ్చితంగా మెత్తగా చేస్తుంది.
 

పాన్ మీద వేడి చేయడం

పాన్ మీద మళ్లీ వేడి చేస్తే కూడా పూరీలు మెత్తగా అవుతాయి. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీడియం మంటపై తవాను వేడి చేయండి. తర్వాత పాన్ మీద కొద్దిగా నెయ్యి వేయండి. పూరీలను తవా పై ఉంచి వాటిని రెండు వైపుల నుంచి తేలికగా వేడి చేయండి. ఎక్కువ వేడి చేయకండి. లేకపోతే పూరీలు గట్టిపడతాయి. 
 


అలాగే పూరీలు గట్టిపడినప్పుడు వాటిపై కొన్ని చుక్కల నీటిని చల్లండి. వాటిని ఒక గిన్నేలో వేసి మూతపెట్టండి. ఇలా కొన్ని నిమిషాలు అలాగే వదిలేయండి. దీంతో తేమ పూరీలలోకి బాగా గ్రహించబడుతుంది. తర్వాత పూరీలు మెత్తగా అవుతాయి. 

Latest Videos

click me!