రోజూ ఒక అరటి పండు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 7, 2024, 3:55 PM IST

పండ్లలో ఒకటైన అరటి పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండును రోజూ ఒకటి తింటే ఏమౌతుందని ఎప్పుడైనా ఆలోచించారా? 
 

అరటి పండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తింటారు. అందులోనూ ఈ పండ్లు ప్రతి సీజన్ లో దొరుకుతాయి. వీటి ధర కూడా ఎక్కువగా ఉండదు. కానీ ఈ పండును తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 
 


మనకు ఎంతో ఇష్టమైన అరటి పండ్లను తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. అలసట మటుమాయం అవుతుంది. ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అందుకే చాలా మందికి భోజనం తర్వాత అరటి పండును తినే అలవాటు ఉంటుంది. అరటిపండ్లలో ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు.


అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అరటిపండు మన గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండ్లలో ఉండే పొటాషియం, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి బాగా సహాయపడతాయి. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు అధిక రక్తపోటు నుంచి మన గుండెను రక్షించడానికి కూడా సహాయపడతాయి. 
 

 అన్ని రకాల పండ్లలాగే అరటి పండ్లలో కూడా బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పండ్లలోని డోపామైన్, కాటెచిన్స్ మన మానసిక స్థితిని మెరుగ్గా  సహాయపడతాయి. అరటిపండ్లలో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ రాత్రిళ్లు మనం బాగా నిద్రపోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Bananas

ఒక మీడియం సైజ్ అరటిపండులో 320-400 మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఈ పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే అరటి పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం, అధిక పొటాషియం కలిసి హై బీపీని నియంత్రించడానికి సహాయపడతాయి.

Latest Videos

click me!