ఈ పండ్లు తిన్నా.. కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

First Published | Aug 7, 2024, 12:42 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అయితే కొన్ని రకాల పండ్లు ఈ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
 

cholestrol

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి మనం తినే ఆహారాలు, తాగే  పానీయాలే అసలు కారణం. ఈ కొలెస్ట్రాల్ లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. అలాగే మీరు తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులను చేసుకుంటే పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే? 

నారింజ

ఈ నారింజ పండ్లు కొంచెం తీయగా, పుల్లగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా.. మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గడం ప్రారంభమవుతాయి. అవును ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. నారింజ పండ్లలో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
 


అరటి

అరటి పండ్లు కాలాలతో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. ఈ పండ్లు చాలా చవకే అయినా.. వీటిని తింటే మనకు తక్షణమే ఎనర్జీ వస్తుంది. అలాగే మనం ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంటాం. ఈ పండు వెయిట్ లాస్ అయ్యే వారికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు అరటి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

అవొకాడో

అవొకాడోలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అవొకాడోను తింటే కూడా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

పైనాపిల్ 

పైనాపిల్ లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో  సహాయపడుతుంది. పైనాపిల్ ను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. 

Latest Videos

click me!