curd
పెరుగు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ పెరుగును ఎప్పుడు ఏ టైంలో తినాలో చాలా మందికి తెలియదు. కొందరు పొద్దున తింటుంటారు. ఇంకొందరూ మధ్యన్నం భోజనంలో తింటుంటారు. ఇంకొందరు నైట్ టైం తింటుంటారు. ఒక్కొక్కరు ఒక్కో టైంకి తింటుంటారు. కానీ పెరుగును సరైన సమయంలో తినకుంటే ప్రమోజనాలు దేవుడెరుగు..ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతారు తెలుసా...
curd
పెరుగు టేస్టీగా ఉండటమే కాదు ఇది మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండిన ఒక ఔషద నిధి. అయితే చాలా మందికి పెరుగును ఎప్పుడు తింటే మంచిదో అన్న ముచ్చట తెలియదు. పెరుగును ఎప్పుడు పడితే అప్పుడు తింటే జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు నైట్ టైం పెరుగును తింటే ఏం ప్రయోజనాలు ఉన్నాయి? ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నైట్ టైం పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు
మెరుగైన జీర్ణక్రియ...
రాత్రిపూట పెరుగును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది అజీర్తి సమస్య ,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ జరగడానికి సహాయపడే బ్యాక్టీరియాను పుట్టిస్తాయి.
బరువు తగ్గడానికి
పెరుగులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు వరప్రదామనే చెప్పాలి. రాత్రిపూట పెరుగును తింటే కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీకు ఆకలి ఎక్కువగా కాదు. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పెరుగు లోని ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి మనల్ని రక్షించడానికి ఉపమోగపడుతుంది. నైట్ టైంలో రెగ్యులర్ గా పెరుగును తింటే మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పోషకాలు:
పెరుగులో కాల్షియం, బి 12 వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. దీంతో రాత్రిపూట పెరుగును తినడం వల్ల మీ ఎముకలు, కండరాలు ,కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పెరుగు లోని ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి మనల్ని రక్షించడానికి ఉపమోగపడుతుంది. నైట్ టైంలో రెగ్యులర్ గా పెరుగును తింటే మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పోషకాలు:
పెరుగులో కాల్షియం, బి 12 వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. దీంతో రాత్రిపూట పెరుగును తినడం వల్ల మీ ఎముకలు, కండరాలు ,కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మంచి నిద్ర:
పెరుగులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం శరీరాన్ని రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీరు రోజూ రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. రాత్రిపూట పెరుగును తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.
రాత్రిపూట పెరుగు తింటే వచ్చే సమస్యలు
లాక్టోస్ అసహనం
లాక్టోస్ అసహనం ఉన్న వారు నైట్ టైం పెరుగును అస్సులు తినకపోవడమే మంచిది. ఒక వేల ఇలాంటి వారు రాత్రిపూట పెరుగును తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
బరువు పెరగడం:
పెరుగులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం పక్కాగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పెరుగులో చక్కెర,ఇతరం స్నాక్స్ జోడించినట్లయితే బరువు పెరిగే అవకాశం ఉంది.
యాసిడ్ రిఫ్లక్స్:
కొంత మందికి పడుకునే ముందు పెరుగును తింటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. అందుకే ఇలాంటి సమస్య రాకుండా ఉండటానికి రాత్రి పడుకునే కొన్ని గంటల ముందు పెరుగు తీసుకుంటే మంచిది. యాసిడ్ రిఫ్లేక్స్ వల్ల కొందరికి గుండెల్లో మంటతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.