వయసు పెరుగుతుంటే ఆ సమస్య.. పరిష్కరించేదెలా..?

First Published | Jun 24, 2021, 1:15 PM IST

ఈ అరుగుుదల సమస్యలు ఉన్నవారు.. కచ్చితంగా వ్యాయామం చేయాలి. బాడీని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఫిట్ గా ఉండా ఉండాలి. అందుకే ప్రతిరోజూ 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.
 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క ముద్ద ఎక్కువ తినాలన్నా.. అమ్మో.. నాకు అరగదు అనేస్తూంటారు. అయితే.. ఈ సమస్య ముఖ్యంగా వయసు పెరుగుతన్నవారిలో ఉంటుంది. దీని కోసం.. కొందరు ట్యాబ్లెట్స్ వాడటం మొదలుపెడాతరు. అయితే.. కేవలం చిన్న చిన్నమార్పులతో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే.. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
దాదాపు... ఈ అరుగుదల సమస్యలన్నీ ముఖ్యంగా బ్యాలెన్స్ డ్ డైట్ ఫాలో కాకపోవడం వల్ల ఈ సమస్యలు మొదలౌతాయట. కాబట్టి.. డైట్ సరిగా ఫాలో కావాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తినాలి.

ఈ అరుగుుదల సమస్యలు ఉన్నవారు.. కచ్చితంగా వ్యాయామం చేయాలి. బాడీని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఫిట్ గా ఉండా ఉండాలి. అందుకే ప్రతిరోజూ 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం తప్పనిసరి
శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అంటే నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే... ఆహారం పూర్తిగా అరుగుతుంది. శక్తి కూడా శరీరానికి అందుతుంది. మలబద్దకం సమస్యలు తగ్గిపోతాయి.
ఇక చాలా మంది అరుగుదల కోసం ట్యాబెల్స్ వాడుతుంటారు. అయితే.. ఏవి పడితే అవి వేసుకోకూడదు. కొన్నింటిని వేసుకోవడం వల్ల సైడ్ ఎపెక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి.. వాటికి దూరంగా ఉండటమే మంచిది.
ఈ అరుగుదల సమస్య ఉన్నవారు.. త్వరగా లావు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. బరువును ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. మరీ ఎక్కువ లావుగా ఉన్నవారిలోనూ ఈ సమస్య మొదలౌతుంది. కాబట్టి.. బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం వల్ల.. ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఎక్కువ ఒత్తిడితో బాధపడేవారు కూడా.. ఈ సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి.. వీలైనంత త్వరగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. మెడిటేషన్, యోగా లాంటివాటికి సమయం కేటాయించాలి.

Latest Videos

click me!