మటన్ పులుసు చిక్కగా కావాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published Jun 3, 2024, 3:21 PM IST

చాలాసార్లు మటన్ ముక్కలు ఉడకవని నీళ్లను చాలా పోస్తుంటారు. దీనివల్ల మటన్ ముక్కలు ఉడికినా గ్రీవీ మాత్రం చాలా పలుచగా ఉంటుంది. దీనివల్ల కూర టేస్ట్ మారుతుంది. అలాగే చూడటానికి కూడా బాగుండదు. అయితే ఇలా కాకుండా మటన్ గ్రేవి చిక్కగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రతి సండే చికెన్ తో పాటుగా మటన్ ను తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాటల్లో లేదా ఆలోచనల వల్ల లేదా కూర ఉడకదనే ఉద్దేశంతో చాలా మంది మటన్ లో నీళ్లను మరీ ఎక్కువగా పోసేస్తుంటారు. దీనివల్ల మటన్ ఉడికినా.. గ్రేవీ మాత్రం అలాగే పలుచగా ఉంటుంది. దీనివల్ల మటన్ కర్రీని తినాలనిపించదు. అయితే మీరు కొన్ని ట్రిక్స్ తో మటన్ కర్రీ గ్రేవి చిక్కగా వచ్చేట్టు చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఉల్లిపాయ ప్యూరీ

ఉల్లిపాయలను మటన్ ఎలాగైనా వేస్తుంటారు. అయితే మీరు ఉల్లిపాయతో మటన్ కర్రీ గ్రేవి చిక్కగా వచ్చేట్టు చేయొచ్చు. అవును మటన్ పులుసులో ఉల్లిపాయ రుచి చాలా బాగుంటుంది. అందుకే మీరు కావాలనుకుంటే మీరు మటన్ పులుసులోగ్రైండ్ ఉల్లిపాయ లేదా తరిగిన ఉల్లిపాయ లేదా రెండింటినీ ఉపయోగించొచ్చు. అయితే తరిగిన ఉల్లిపాయలను వేయడం వల్ల పులుసు స్థిరత్వం దెబ్బతింటుంది. అందుకే మీరు ఉల్లిపాయ ప్యూరీని ఉపయోగించడం మంచిది. ఇందుకోసం 1 ఉల్లిపాయను తొక్క తీసి గ్రైండర్ లో వేయండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయను మెత్తగా గ్రైండ్ చేసి వాడండి
 

Latest Videos


పెరుగు 

పులుసు చిక్కగా ఉండటానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగు పులుసును చిక్కగా చేయడమే కాకుండడా రుచిగా కూడా చేస్తుంది. అయితే పెరుగును వేసిన తర్వాత పెరుగు పచ్చిదనం బయటకు పోయేలా పులుసును కొద్దిగా ఉడకబెట్టాలి. అయితే పెరుగును వేడివేడి కూరలో వేయకూడదు. ఇలా చేస్తే పులుసులోనే పెరుగు కరిగిపోయి మీ శ్రమ వృధా అవుతుంది. పెరుగును అలాగే వేయడానికి బదులుగా బాగా బీట్ చేసి, రుబ్బిన తర్వాతే పులుసులో కలుపుకుంటే మంచిది.

 శెనగపిండి

మటన్ కర్రీలో శెనగపిండిని కూడా ఉపయోగిస్తారు. మీరు ఇలా ఎప్పుడూ చేయకుంటే ఈసారి మటన్ తయారు చేసేటప్పుడు దీనిని ఖచ్చితంగా వాడండి. మటన్ పులుసు చాలా పలుచగా మారినప్పుడు శెనగపిండిని ఉపయోగిస్తే చిక్కగా మారుతుంది. కానీ కానీ శనగపిండిని ఎక్కువగా వాడితే సమస్యలు వస్తాయి. అలాగే శెనగపిండిని వేయించేటప్పుడు తేలికపాటి మంటమీదే ఉంచాలి. పిండి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉడికించాలి. 


మటన్ ముక్కలు వేసి చిక్కగా చేసుకోవాలి

పులుసు మరీ పలుచగా అయిందని అనిపిస్తే మటన్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి వేయండి. దీనివల్ల మటన్ కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఈ చిట్కా చాలా కష్టమైన పనిగా అనిపించొచ్చు. కానీ ఇది పనిచేస్తుంది. 

click me!