రెగ్యులర్ కాదు.. ఈ దోశ తింటే.. కచ్చితంగా బరువు తగ్గుతారు..!

First Published | Jun 3, 2024, 12:45 PM IST

జనరల్ గా మనం దోశ తయారుచేసే సమయంలో బియ్యం వేస్తూ ఉంటాం. కానీ ఈసారి బియ్యం పక్కన పెట్టి... మిల్లెట్స్ వాడటం మొదలుపెడితే.. ఆ సమస్య ఉండదట. 

Dosa

బరువు తగ్గాలి అంటే.. మనకు నచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు..  చాలా తక్కువ తినాలి..  ఎక్కువ సేపు వ్యాయామం చేయాలి ఇలా చాలా వినే ఉంటారు. కానీ.. ఈ మాటలన్నీ పక్కన పెట్టేయండి. మీరు రుచి గల ఫుడ్ తిని కూడా  బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?  మీరు చదివింది అక్షరాల సత్యం.  ఎందుకంటే... బరువు తగ్గాలి అంటే... మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే దోశ, ఇడ్లీ లాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే.. వాటిలో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల బరువు పెరిగిపోతారు అనుకుంటారు. కానీ... మీరు ఈ టేస్టీ దోశ హ్యాపీగా తింటూ.. బరువు తగ్గవచ్చు. మరి, ఆ దోశ రెసిపీ ఏంటి..? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

జనరల్ గా మనం దోశ తయారుచేసే సమయంలో బియ్యం వేస్తూ ఉంటాం. కానీ ఈసారి బియ్యం పక్కన పెట్టి... మిల్లెట్స్ వాడటం మొదలుపెడితే.. ఆ సమస్య ఉండదట. మిల్లెట్స్ లో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా  సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తాయి. మరి ఏ మిల్లెట్ వాడాలి..? ఆ దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
 


ఉలవలు, కొర్రలు.. వీటిని ఒకప్పుడు అన్నం కి బదులు తినేవారు. కానీ వైట్ రైస్ తినడం అలవాటు అయిన తర్వాత.. వీటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వీటినే మనం దోశల్లో వాడబోతున్నాం.
 

millets

ఉలవలు, కొర్రలు రెండింటిలోనూ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.  వీటితో చేసిన దోశను మీరు తినడం వల్ల... మీరు మీ రోజును ఆరోగ్యంగా మొదలుపెట్టినవారు అవుతారు.

ఈ దోశ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ దోశ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఒక గొప్ప ఎంపిక.
ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది.ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. కాబట్టి, రక్తహీనత ఉన్నవారు అంటే శరీరంలో రక్తం లేనివారు దీనిని తప్పనిసరిగా తినాలి.
 

దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు..
కొర్రలు - 1 కప్పు
ఉలవలు - అర కప్పు
పద్ధతి
రెండు వస్తువులను బాగా కడగాలి. వాటిని నానబెట్టండి.
ఇప్పుడు బ్లెండ్ చేయండి.
అరగంట అలాగే వదిలేయండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి దోశలు వేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈజీగా బరువు కూడా తగ్గుతారు.

Latest Videos

click me!