షుగర్ ఉన్నవారు అరటిపండ్లు తినొచ్చా?

First Published Jun 3, 2024, 1:58 PM IST

షుగర్ వ్యాధి లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్యైతే కాదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ పెరగకుండా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా డయాబెటీస్ ఉంటే తీపి ఆహారాలకు దూరంగా ఉంటారు. మరి తీయగా ఉండే అరటిపండ్లను వీళ్లు తినొచ్చా? లేదా? 
 

దేశంలో డయాబెటిస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతీయ జనాభాలో మధుమేహలు సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశాన్ని "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలుస్తారు. జెనెటిక్స్,  నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ వంటి వివిధ కారణాల వల్ల దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 

డయాబెటిస్ ఉన్నవారు ఏవి పడితే అవి తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. ముఖ్యంగా తీపి ఆహారాలను. చాలా మంది డయాబెటీస్ పేషెంట్లకు ఏ ఆహారాలను తినకూడదో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అరటిపండు విషయంలో కూడా. అందుకే ఈ రోజు డయాబెటీస్ ఉన్నవారు అరటిపండ్లను తినాలో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


అరటిపండ్లలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండు తీయగా ఉంటుంది. అందుకే మధుమేహులు వీటికి దూరంగా ఉంటారు. అరటిపండ్లను తింటే డయాబెటీస్ పేషెంట్ల షుగర్ లెవల్స్ త్వరగా పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు.
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని పండ్లను తక్కువ పరిమాణంలో తినొచ్చు. మధుమేహులు అరటిపండ్లను కూడా తినొచ్చు. కాకపోతే తక్కువ మొత్తంలో తినాలి. అరటి డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

అరటిపండ్లు తియ్యగా ఉంటాయి. అలాగే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మధుమేహులకు ఎలాంటి హాని చేయదు. అరటిపండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెరగనివ్వదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఒక మీడియం సైజు అరటిపండును తినొచ్చు.

అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉన్నవారు మాత్రమే అరటిపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపోగ్లైసీమియాతో బాధపడేవారు అరటిపండ్లకు దూరంగా ఉండటమే మంచిది. వీళ్లు అరటిపండ్లు తినాలా? వద్దా? అనేది డైటీషియన్ లేదా డాక్టర్ ను సంప్రదించాలి. 

click me!