ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడి నుంచి తట్టుకోవాలంటే.. శరీరాన్ని కూల్ చేసే డ్రింక్స్ తాగక తప్పదు. అలాంటి వాటిలో షుగర్ కేన్ జ్యూస్( చెరుకు రసం) ముందు వరసలో ఉంటుంది.
undefined
ప్రస్తుతం కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయటకు వెళ్లి ఆహారం తీసుకునే ధైర్యం చేయలేము. ఎక్కడ వైరస్ ఉందో చెప్పలేని పరిస్థితి ఉంది. మరి చెరుకు రసం తాగాలన్న కోరిక ఎలా తీరుతుంది. అంటే... చిటికెలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది కూడా చెరుకు గడలు లేకుండా చేయవచ్చు. అలా ఎలా చేయాలి.. అందుకోసం ఏం కావాలో ఇప్పుడు చూద్దాం..
undefined
కావాల్సిన పదార్థాలు..బెల్లం అరకేజీ, కొత్తమీర ఆకులు, పుదీనా, బ్లాక్ సాల్ట్, నిమ్మకాయ
undefined
బెల్లాన్ని చెరుకుతోనే తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అందుకే.. ఇప్పుడు ఆ బెల్లంతోనే మళ్లీ చెరకు రసం చేసుకోవాలి. ముందుగా బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
undefined
ఆ తర్వాత కట్ చేసిన బెల్లాన్ని నీటిలో.. అరగంట సేపు కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.
undefined
తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ ని మిక్సీలో రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని బెల్లం కరగపెట్టిన నీటిలో కలపాలి.
undefined
ఈ మిశ్రమాన్ని మరోసారి వడపోయాలి.తద్వారా కొత్తిమీర లేదా పుదీనా యొక్క మిగిలిన భాగం శుభ్రం చేయబడుతుంది. మీరు రుచిగల రసాన్ని పొందవచ్చు.
undefined
మార్కెట్లో కనిపించే చెరకు రసంలో నురుగు చూపిస్తుంది. ఇంట్లో నురుగు తీసుకురావడం కోసం బ్లెండర్ లో వేస్తే సరిపోతుంది.
undefined
అంతే షుగర్ కేన్ జ్యూస్ రెడీ. దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే.. చల్ల చల్లగా చెరుకు రసం ఆస్వాదించవచ్చు.
undefined
చెరకు రసంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. దంతాల సమస్య కూడా తగ్గుతుంది.
undefined
ఒక గ్లాసు చెరకు రసం ఎండాకాలం అలసటను తగ్గిస్తుంది. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఇది బెస్ట్.
undefined