ఈ రోజుల్లో కరోనా మహమ్మారి సోకనివారంటూ ఎవరూ ఉండటం లేదు. సెకండ్ వేవ్ లో కరోనా ఎవరినీ వదలడం లేదు. కొందరు వారం రోజుల్లో కోలుకుంటూటే.. కొందరు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో.. రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం
undefined
మీరు కూడా కరోనా సోకి హోం ఐసోలేషన్ లో ఉంటే.. ఆ మహమ్మారిని జయించడానికి.. ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
undefined
కరోనా పాజిటివ్ గా వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, అన్ శాచ్యూరేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోటీన్ల కోసం చేపలు, ఉడకపెట్టిన గుడ్లు తినొచ్చు. చికెన్ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు.
undefined
విటమిన్ సీ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు కనీసం రెండు సార్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
undefined
ఎండు ఫలాలు, బెల్లం, నువ్వులు, నెయ్యితో కలిపి చేసిన లడ్డూలు రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, మాంగనీస్ అందుతాయని వైద్యులు చెబుతున్నారు.
undefined
కరోనా వచ్చినవారు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం.. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల మంచినీరు తాగాలి. దీంతో పాటు కొబ్బరి నీళ్లు రెండు పూటలా తీసుకోవాలని న్యూట్రీషన్ వైద్యులు చెబుతున్నారు. అయితే... కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ లాంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలి.
undefined
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కంటే... కొంచెం కొంచెంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొద్దికొద్దిగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది సార్లు తినాలి. ఆహారంలో నెయ్యి, బెల్లం, ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో చేసిన కిచిడీ.. ఫర్మెంటెడ్ రైస్ ( చద్దన్నం) తినడం మంచిది.
undefined
ఈ డైట్ ఫాలో అవుతూనే.. వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం.. రోజుకు రెండు, మూడుసార్లు ఆవిరి పట్టడం లాంటివి చేయాలి. ప్రాణయామం చేయడం కూడా చాలా మంచిది. సరైన నిద్ర కూడా అవసరం. ఇవన్నీ ఫాలో అయితే.. కరోనాని సులభంగా జయించవచ్చు.
undefined