idli
దక్షిణాదిన ఎక్కువ మంది ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ ముందుంటుంది. దాదాపు అందరి ఇళ్లల్లో ఇడ్లీ చేసుకుంటూ ఉంటారు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ , సాంబారు ఇలా కాంబినేషన్ ఏది మారినా.. ఇడ్లీ టేస్టు మాత్రం అదిరిపోతుంది. అయితే చాలా మందికి ఇడ్లీ మెత్తగా చేయడం రాదు. గట్టిగా వస్తూ ఉంటాయి. అయితే.. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే.. ఇడ్లీలు మెత్తగా.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా వస్తాయి. దాని కోసం ఏం ఏం చేయాలో ఓసారి చూద్దాం..
ఇడ్లీలు చేయడానికి మనం పప్పు, రవ్వ తీసుకునే రేషియో మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసం మీరు ఒక కప్పు పప్పు తీసుకుంటే.. నాలుగు కప్పుల రవ్వ తీసుకోవాలి.
ఇక పప్పు, రవ్వలను విడివిడిగా కనీసం 4 నుంచి 6 గంటలపాటు నాననివ్వాలి. నానిన తర్వాత.. రెండింటినీ బాగా శుభ్రం చేసుకోవాలి. పప్పును కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పిండిలోకి రవ్వను కడిగి.,. నీళ్లు లేకుండా పిండేసి వేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
Idli Sambar
ఈ పిండిలో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల.. పిండి బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది. రాత్రంతా పిండి మంచిగా పొంగేలా చూడాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ పిండితో ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే.. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.