ఈ విషయం తెలిస్తే రోజూ మరమరాలు తింటారు..!

First Published | Feb 22, 2024, 12:09 PM IST

మరమరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల..మలబద్ధకం సమస్య దూరమౌతుంది. అంతేకాదు.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

Bhelpuri

చాలా మంది మరమరాలను పెద్దగా పట్టించుకోరు. వాటి వల్ల  పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేదని అనుకుంటారు. కానీ... వీటి వల్ల కూడా మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కూడా ప్రతిరోజూ మరమరాలను మన ఆహారంలో భాగం చేసుకుంటారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం...
 

Bhel Puri

మరమరాలలో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. వాటిలో ఫైబర్,  ప్రోటీన్, జింక్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి మైక్రో న్యూట్రియంట్స్  పుష్కలంగా ఉంటాయి.


Bhel

మరమరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల..మలబద్ధకం సమస్య దూరమౌతుంది. అంతేకాదు.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

Bhel Puri

ఈ మరమరాలు చాలా  లైట్ గా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.  వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల  బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఆకలి కూడా పెద్దగా వేయదు.

Puffed Rice business

మరమరాల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ డి, రైబో ఫ్లేవిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. బోన్ సెల్ గ్రోత్ పెరగడానికి, బాడీ డెవలప్మెంట్ కి సహాయపడతాయి.

మరమరాల్లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు..బీపీని కంట్రోల్ చేయడానికి కీలకంగా పనిచేస్తుంది.

Bhelpuri

చాలా రకాల జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మరమరాలు సహాయపడతాయి. రోజూ గుప్పెడు మరమరాలు తిన్నా, దానితో చేసిన పోహా తిన్నా కూడా  జీర్ణ సమస్యలు పరిష్కరించడానికి హెల్ప్ అవుతుంది.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం సహజంగా మెరిసిపోయేలా చేస్తుంది. ముఖంపై ముడతలు, డార్క్ స్పాట్స్ లను తొలగించడానికి సహాయపడతాయి.

Latest Videos

click me!