మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇన్ని వంటలు చేయెచ్చా..?

First Published | Feb 20, 2024, 1:55 PM IST

నిన్న ఇడ్లీనే కదా.. మళ్లీ ఈరోజు ఎందుకు అని వద్దు, తినమూ అనేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా..? అలాంటప్పుడు  ఈ కింది డిష్ లు ప్రిపేర్ చేయండి. వీటి కోసం మళ్లీ మీరు స్పెషల్ గా కష్టపడాల్సిన పనిలేదు. మీరు రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంటే చాలు.. కమ్మగా ఈ వంటలు ఆరగించవచ్చు. 

idli batter at home

మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీలో ఎక్కువగా వినపడే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ.  చేయడం సులభం. అరుగుదలకు కూడా మంచిది కాబట్టి.. ఎక్కువ మంది ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు. ఒక్కసారి పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటే చక్కగా రెండు మూడురోజులు వస్తుంది. కానీ.. వరసగా రోజూ ఇడ్లీ పెడితే.. ఇంట్లో పిల్లలు మారాం చేస్తారు. నిన్న ఇడ్లీనే కదా.. మళ్లీ ఈరోజు ఎందుకు అని వద్దు, తినమూ అనేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా..? అలాంటప్పుడు  ఈ కింది డిష్ లు ప్రిపేర్ చేయండి. వీటి కోసం మళ్లీ మీరు స్పెషల్ గా కష్టపడాల్సిన పనిలేదు. మీరు రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంటే చాలు.. కమ్మగా ఈ వంటలు ఆరగించవచ్చు. మరి అవి ఏంటి..? ఎలా చేయాలో ఓసారి చూసేయండి...

Paniyaram

1.గుంట పుంగనాలు..
ఇడ్లీ పిండితో టేస్టీ గుంట పుంగనాలు చేసుకోవచ్చు. దీనికి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. ఇడ్లీ పిండిలోనే ఉల్లిపా, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము వేసుకొని కొద్దిగా నూనె వేసి.. ఈ పుంగనాలు వేసుకోవచ్చు. దీనికంటూ స్పెషల్ గా ప్యాన్ మార్కెట్ లో లభిస్తుంది.


2.వెజిటేబుల్ ఉతప్పం..
దీనిని దోశ లాగానే ఇడ్లీ పిండితో వేస్తారు. కాకపోతే కాస్త మందంగా వేసుకోవచ్చు.దాంట్లోనే ఉల్లి తరుగు, క్యారెట్ తరుగు వేసుకుంటే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. సాంబార్, చట్నీ కాంబినేషన్ తో తింటే అద్భుతంగా ఉంటుంది.
 

Pesarattu Dosa

3.పెసరట్టు..
నమ్మసక్యంగా లేకపోయినా.. ఇడ్లీ పిండితో పెసరట్టు చేయవచ్చు. నిజానికి పెసరట్టు పెసలతో తయారు చేస్తారు. అదే పెసరట్టు పిండిలో.. ఇడ్లీ పిండి కూడా కలిపి దోశలు వేసుకుంటే.. రుచి  చాలా బాగుంటుంది.

4.దహీ వడా..
మిగిలిపోయిన ఇడ్లీ పిండితో దహీవడా కూడా రుచిగా చేయవచ్చు. ఇడ్లీ పిండితో వడలుగా చేసుకొని.. వాటిని పోపు వేసిన పెరుగులో నానపెడితే సరిపోతుంది. రుచి అదిరిపోతుంది. దహీ వడా చాలా కమ్మగా ఉంటాయి.
 

Appam

5.అప్పమ్..
ఇడ్లీ పిండితో రుచి కరమైన అప్పం కూడా చేసుకోవచ్చు. అప్పం అంటే.. ప్యాన్ కేక్ లాగే చేస్తారు. దీనిని చట్నీ, సాంబారు తో లేదంటే స్నాక్స్ గా కూడా తినొచ్చు.

6. ఇడియప్పమ్..
మిగిలిపోయిన ఇడ్లీ పిండిని.. ఇడియప్పమ్ కూడా చేసుకోవచ్చు. రైస్ నూడిల్స్ అని కూడా అంటారు వీటిని.  చేయడం చాలా సులువు. టేస్ట్ కూడా బాగుంటుంది.
 

Latest Videos

click me!