ఎండపెట్టే పనిలేకుండా వడియాలు ఎలా చేయాలో మీకు తెలుసా?

First Published May 20, 2024, 1:20 PM IST

ఇంట్లోనే పెద్దగా శ్రమ లేకుండా.. కనీసం ఎండపెట్టే పనికూడా లేకుండా.. వడియాలు తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి అందించడమే కాకుండా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి పేపర్ వడియాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

వడియాలు, అప్పడాలు ఇష్టపడనివారు ఎవరు ఉంటారు..? పప్పు, చారు లాంటి కూరలతో భోజనం చేసే సమయంలో సైడ్ డిష్ గా  వడియాలు ఉంటే.. ఆ రుచే వేరు.  చిన్న పిల్లలు సైతం వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ... వాటిని చేసుకోవడం పెద్ద శ్రమ.. ఈ అపార్టెంట్ సంస్కృతిలో... వడియాలు ఎండపెట్టుకునే అంత ప్లేస్ కూడా ఉంటుందా అని కొందరు వాటి జోలికి పోవడం లేదు. మరి కొందరు... వాటి మీద ఇష్టం చంపుకోలేక మార్కెట్లో దొరికేవి తెచ్చుకొని కొనుక్కుంటూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికేవి మనం చేసుకున్నంత టేస్ట్, శుభ్రత ఉండకపోవచ్చు.
 

అలాంటివారు.. ఇంట్లోనే పెద్దగా శ్రమ లేకుండా.. కనీసం ఎండపెట్టే పనికూడా లేకుండా.. వడియాలు తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి అందించడమే కాకుండా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి పేపర్ వడియాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
 

Latest Videos


ముందుగా.. ఈ వడియాలు తయారు చేయడానికి మనకు సగ్గు బియ్యం ఉంటే సరిపోతుంది. ఆ సగ్గు బియ్యంతోనే ఈ వడియాలను తయారు చేస్తాం. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే... దానికి ఆరు కప్పుల నీరు అవసరం అవుతాయి.
 

papadam

papadamముందుగా సగ్గు బియ్యం కప్పు తీసుకొని.. కనీసం రెండు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత.. ఆరు కప్పుల నీటిని తీసుకొని నీటిని మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి... అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు... ఆ నీటిలో.. ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం తీసి.. ఈ మరిగించిన నీటిలో వేయాలి.  దాదాపు 10 గంటలపాటు.. ఈ నీటిలో వాటిని నాననివ్వాలి.

మంచిగా నానాయి అనుకున్న తర్వాత... వాటిని మిక్సీ జార్ లో వేసి.. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇఫ్పుడు... ఇంట్లో మీకు అందుబాటులో ఉండే.. ఏదైనా పాత చీర, లేదంటే.. ప్లాస్టిక్ కవర్ మీద వడియాల్లాగా పోసుకోవాలి.

మొత్తం పిండి అలా పెట్టుకున్న తర్వాత.. మీరు ఇంట్లో ఫ్యాన్స్ కి కింద.. రెండు, మూడు గంటలు ఆరనిస్తే సరిపోతుంది. చాలా త్వరగా ఆరిపోతాయి.  మనకు నచ్చిన సమయంలో నూనెలో వేయించుకొని .. కమ్మగా ఆరగించడమే. నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతాయి. టేస్ట్ మాత్రమే కాదు.. ఇంట్లో, సగ్గు బియ్యంతో చేసినవి కావడంతో.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

click me!