రక్తహీనత
మగవారికంటే ఆడవారే ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారికి దొండకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కూరగాయలో మంచి మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని ఎన్నో రోగాలకు, సంక్రమణలకు దూరంగా ఉంచుతుంది.