పూరీలు మెత్తగా, టేస్టీగా రావాలంటే ఇలా చేయండి

First Published | Jun 21, 2024, 1:17 PM IST

పూరీలంటే చాలా మందికి ఇష్టం. బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా వీటినే తింటుంటారు. కానీ ఇంట్లో చేసిన పూరీలు హోటల్ లో చేసిన  మాదిరికగా స్మూత్ గా రావు. అలాగే నూనె కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా? 
 

వేడి వేడి పూరీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పప్పు లేదా పూరీ కర్రీతో వేడివేడిగా బ్రేక్ ఫాస్ట్ లో పూరీలను తింటుంటే వచ్చే మజానే వేరు. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా పూరీలను తినడానికే ఇష్టపడతారు. కానీ ఇంట్లో చేసిన పూరీలు మెత్తగా రావు. అందులోనూ వీటికి చాలా నూనె పట్టుకుని ఉంటుంది. ఇలాంటి పూరీలను ఒకటి కంటే ఎక్కువ తినడం కష్టం. కానీ మీరు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మాత్రం మీరు చేసిన పూరీలు మెత్తగా, టేస్టీగా వస్తాయి. అలాగే నూనె కూడా ఎక్కువగా పట్టదు. పూరీలను ఎలా చేస్తే మెత్తగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పూరీలను తయారుచేసే ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు రవ్వను కలపండి. అలాగే దీంట్లోనే ఒక టీస్పూన్ నూనె, తగినంత వాటర్, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత  పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్టండి. వీటిని చపాతీలు చేసి నూనెలో వేయించండి. దీనివల్ల పూరీకి ఎక్కువ నూనె పట్టుకోదు. అలాగే పూరీ చాలా మెత్తగా వస్తుంది. 
 


పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకోకుండా ఉండటానికి పూరీ పిండిని కలిపేటప్పుడు ఎక్కువ నీళ్లను వాడకండి. ఎందుకంటే నీళ్లు ఎక్కువ పోసి పిండిని కలిపితే పూరీలు నూనెను ఎక్కువగా గ్రహిస్తాయి. అందుకే తక్కువ నీళ్లతో పిండిని కలపండి. నిజానికి చపాతీ పిండితో పోలిస్తే పూరీకి కొంచెం మందమైన పిండి అవసరం. ఇది పూరీ త్వరగా, బాగా రావడానికి సహాయపడుతుంది.

పూరీలను ఎప్పుడూ కూడా వేడెక్కని నూనెలో వేయకూడదు. పూరీలు మెత్తగా రావాలంటే మాత్రం నూనె బాగా వేడెక్కిన తర్వాతే పూరీలను కాల్చుకోవాలి. ఇలా చేస్తే పూరీలు ఎక్కువ నూనెను గ్రహించకుండా ఉంటాయి. 
 


పూరీలను నిటారుగా పెట్టి వేడి నూనెలో వేయకుండా చూసుకోండి. ఎందుకంటే దీనివల్ల  నూనెలో వేసేటప్పుడు ఆయిల్ బయటపడుతుంది. దీనివల్ల మీకు గాయాలు అవుతాయి. అందుకే పూరీలను నెమ్మదిగా ఒక సైడ్ పై వేయాలి. 

Latest Videos

click me!