పండ్లు, కూరగాయలు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Aug 20, 2024, 2:14 PM IST

చాలా మంది పండ్లను, కూరగాయలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటుంటారు. కానీ ఇవి చాలా రోజులు ఉంటే తొందరగా పాడైపోతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా? 
 

fruits and vegetables

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది పండ్లను, కూరగాయలను ఒకేసారి కొనిపెడుతుంటారు. కానీ వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటే తొందరగా పాడవుతాయి. అయితే చాలా మంది వీటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఎక్కువ రోజులు పెడితే వాటిలోని పోషకాలు తగ్గుతాయి. అలాగే మురిగిపోతుంటాయి. ఇలా కాకుండా ఎక్కువ రోజులు పండ్లు కూరగాయలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ద్రాక్షపండ్ల రెండు, మూడు రోజుల్లోనే పాడైపోతుంటాయి. ఈ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జిప్ బ్యాగ్ లో పెట్టేసి మూసేయండి. దీంతో అవి తొందరగా చెడిపోవు. అలాగే పుచ్చకాయను నెలరోజులు పాడవకుండా చేయొచ్చు. పాలకూర తొందరగా పాడవకుండా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్లో చుట్టండి. ఇలా చేస్తే నాలుగు వారాల పాటు కూర దెబ్బతినదు. 
 

Latest Videos


అరటిపండ్లు కూడా చాలా తొందరగా పాడవుతుంటాయి. అయితే ఈ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే  కాండాన్ని టిష్యూ పేపర్ తో చుట్టండి. అలాగే పండ్లను అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. అయితే ఈ పండ్లను వేరే పండ్లకు దూరంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల అరటిపండ్లు 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అవొకాడోను చాలా రోజులు నిల్వ ఉంచడానికి గాలి చొరబడని కంటైనర్ లో ఉంచండి. ఇవి మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.
 

దోసకాయలు ఫ్రెష్ గా ఉండాలంటే  ఫ్రిజ్ లో ఉంచండి. వీటిని రంధ్రాలు ఉన్న జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టండి. నిమ్మకాయను ఫ్రిజ్ లో పెడితే చెక్కుచెదరకుండా ఉంటాయి. బంగాళాదుంపలను గదిలో వెలుతురు లేని చల్లని ప్రదేశంలో ఉంచితే అవి చెడిపోకుండా ఉంటాయి. స్ట్రాబెర్రీలను కూడా మీరు ఎక్కువ రోజులు పాడవకుండా చేయొచ్చు. వీటిని గాలిచొరబడని కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో నిల్వ చేయండి.

click me!