ఈ పాలు తాగితే సంతాన సమస్యలు ఉండవు..!

First Published | Aug 20, 2024, 2:07 PM IST

ఎప్పుడైనా పాలల్లో లవంగాలు వేసుకొని తాగారా? ఈ రెండూ కలిపి తీసుకుంటే ఏమౌతుందో ఓసారి చూద్దాం..

milk


పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలల్లో మనకు కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. చాలా మంది రెగ్యులర్ గా పాలు తాగుతూ ఉంటారు. ఆ పాలల్లో పంచదార, బెల్లం, బూస్ట్, హార్లిక్స్ ఇలా ఏదేదోకలుపుకొని తాగేస్తూ ఉంటారు. కానీ.. ఎప్పుడైనా పాలల్లో లవంగాలు వేసుకొని తాగారా? ఈ రెండూ కలిపి తీసుకుంటే ఏమౌతుందో ఓసారి చూద్దాం..

clove

పాలల్లో మనకు కాల్షియం, విటమిన్ డి ఉన్నట్లే...  లవంగాల్లో ప్రోటీన్, ఐరన్, కార్బో హైడ్రేట్స్, కాల్షియం ఇతర న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఉట్టిపాలకంటే.. లవంగాలు వేసి మరీ తాగడం వల్ల.. అదనపు ప్రయోజనాలు కలుగుతాయట. మరి.. ఎలాంటి ప్రజయోనాలు కలుగుతాయో తెలుసుకుందాం


mouth ulcers

చాలా మందికి వేడి చేసినప్పుడు.. నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి. అదే.. పాలల్లో లవంగాలుకలిపి తీసుకోవడం వల్ల... నోటి అల్సర్స్ తో పాటు.. కడుపులో అల్సర్స్ కూడా తగ్గిపోతాయి. ముందు వాటి తాలుకా నొప్పిని చాలా తొందరగా తగ్గిస్తుంది.

digestion

చాలా మంది తీసుకునే ఆహారం సరిగా జీర్ణమవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉంటే.. ఈ లవంగం పాలు తాగడం వల్ల.. మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఏమున్నా..వెంటనే తగ్గించేస్తుంది.


సంతానం లేక ఇబ్బందిపడుతున్నవారు ఎవరైనా ఉంటే.. వారు ఈ లవంగం పాలు తీసుకోవడం వల్ల.. వారిలో ఫెర్టిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాస్త.. బ్యాలెన్స్డ్ గా మారుతుంది.

ఇవి మాత్రమే కాదు.. పని ఒత్తిడితో బాధపడుతున్నవారు.. ఈ పాలు తాగితే... ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. దీనిలో ఉండే కాపర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ లు.. మూడ్ ని హాయిగా మారుస్తాయి. మీ గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ ని కూడా నార్మల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉండటానికి సహాయపడుతుంది. గొంతు నొప్పి ఏదైనా ఉంటే చాలా తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తుంది.

పాలతో లవంగాలు కూడా కలిపి తీసుకుంటున్నాం కాబట్టి.. నోటి దుర్వాసన పోగొట్టడంతో పాటు.. దంత సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పాలల్లో కాల్షియం..దంతాలను బలంగా మారుస్తాయి.

Latest Videos

click me!