వేడి నీళ్లలో తేనె కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 20, 2024, 12:02 PM IST

చాలా మంది లెమన్ వాటర్ కు బదులుగా వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనుకుంటారు. కానీ ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఏమౌతుందో తెలుసా?
 

బరువు తగ్గడానికి చాలా మంది  ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లలో తేనెను కలుపుకుని తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయనుకుంటారు. కానీ ఈ వాటర్ ను తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందో తెలుసా? 

ఆయుర్వేదం ఏం చెబుతోంది?

ఆయుర్వేదం ప్రకారం.. తేనెను వేడి నీళ్లలో కలపడం లేదా వేడి చేసి తీసుకోవడం వల్ల ఇది నెమ్మదిగా మన శరీరానికి విషంలా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వాటర్ ను తాగితే మన శరీరంలో శ్లేష్మం,  ఇది విషపూరితంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  దీనివల్ల మీకు ఎన్నో వ్యాధులు వస్తాయి. 
 

Latest Videos



పోషకాలు తగ్గుతాయి

ముడి తేనెలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మీరు తేనెను వేడి పదార్థాలతో కలిపితే దానిలో ఉండే పోషకాలు తగ్గుతాయి. 

అధ్యయనం ఏం చెబుతోంది?

నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. తేనెను 60 నుంచి 140 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే అది గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. అంతేకాదు తేనెను 60 డిగ్రీలు, 140 డిగ్రీల వరకు వేడిచేస్తే దానిలోని నమూనాలు మన ఆరోగ్యానికి హాని కలిగించే హైడ్రాక్సీమిథైల్ ఫర్ఫ్యూరల్డిహైడ్ అనే ఎక్కువ సమ్మేళనాలు ఉన్నట్లు అధ్యయనం కనుగొంది.
 

తేనెను ఎందుకు వేడి చేయకూడదు?

నెయ్యి,  తేనె

నెయ్యి,  తేనెను సమాన మొత్తంలో తీసుకోవడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే పదార్ధం శరీరంలో ఫాస్ట్ గా వ్యాపిస్తుంది. దీని వల్ల ఒక వ్యక్తికి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే కడుపునొప్పి కూడా వస్తుంది. 
 

తేనెను ఎలా తినాలి? 

ఆయుర్వేదం ప్రకారం.. ముడి తేనెను ఎప్పుడూ వాడకూడదు. ఎందుకంటే ఈ తేనెలోని బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. సాధారణంగా ఇళ్లలో వాడే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు. గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగొచ్చు. సాధారణంగా 70 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 30 నుంచి 45 గ్రాముల తేనె మాత్రమే తినాలి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే రోజూ ఒక టీస్పూన్ తేనె తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

click me!