
నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. యవ్వనంగా మార్చడంలోనూ సహాయం చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, సులభంగా కరిగే ఫైబర పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా, రక్త హీనతను తగ్గించడానికి, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఆపడంలోనూ , జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ సహాయం చేస్తుంది. మరి.. ఎండాకాలంలో ఏదో ఒక రూపంలో రోజుకి ఒక నిమ్మకాయ తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం...
లివర్ ఆరోగ్యంగా మార్చే నిమ్మకాయ..
నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ని సరి చేయవచ్చు. నిమ్మకాయలో సహజంగా డీటాక్సిన్ లక్షణాలు ఉంటాయి. ఇవి..లివర్ ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం వేసుకొని తాగితే, టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి.
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే నిమ్మకాయ..
మీరు మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతుంటే, మీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోండి. నిమ్మకాయ ఏడాది పొడవునా సులభంగా లభించే పండు. నిమ్మకాయ నీటిలో అధిక స్థాయిలో సిట్రేట్ ఉంటుంది, ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. సిట్రేట్ కాల్షియం స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను నివారిస్తుంది.
ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించడంలో సహాయపడవచ్చు
నిమ్మకాయ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. నిమ్మకాయలో కనిపించే ప్రధాన భాగాలలో ఒకటి పాలీఫెనాల్స్, ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత పెరగడం వల్ల ఇన్సులిన్ హార్మోన్‌కు ప్రతిస్పందన తగ్గుతుంది, ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు.
విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి
నిమ్మకాయ విటమిన్ సి మంచి మూలం, కాబట్టి ప్రతిరోజూ 1 నిమ్మకాయ తినడం వల్ల విటమిన్ సి రోజువారీ అవసరంలో సగం దీనితోనే లభిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది
శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలలో పెక్టిన్ అనే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే ప్రీబయోటిక్. అయితే, ప్రతి ఉదయం నిమ్మరసం ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలు.