గోధుమ పిండిని మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి.. ఇంట్లో కూడా ఎక్కువగా తెచ్చి స్టోర్ చేస్తూ ఉంటాం. కానీ... ఈ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తాజాదనం తగ్గిపోతుంది. పిండి ఒకరకమైన వాసన వస్తూ ఉంటుంది. ఒక్కోసారి పురుగులు కూడా పడుతూ ఉంటాయి. చేసేదిలేక... ఆ పిండిని పారబోస్తూ ఉంటాం. మీకు కూడా ప్రతిసారీ ఇదే జరుగుతోందా..? అయితే.. ఇక నుంచి అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే... ఎన్ని రోజులు అయినా.. పిండి పాడవ్వకుండా తాజాగా ఉంటుంది.
అసలు.. పిండి ఎందుకు పాడైపోతుంది..?
సాధారణంగా అది గోధుమ పిండి అయినా, ఇంకేదైనా పిండి అయినా.. పాడవ్వకుండా ఉండాలంటే.. దానిని ఉంచిన కంటైనర్ కి గాలి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే... గాలి తగలడం మొదలుపెడితే.. ఆ పిండి తొందరగా పాడౌతుంది. ఆ పిండిలోని ప్లేవర్స్ అన్నీ పోయి.. దుర్వాసన రావడం మొదలౌతుంది.
లేదు అంటే.. మనం పిండిలో చేతులు పెడుతున్నప్పుడు.. వాటికి కాస్త తడి తగిలినా కూడా పిండి పాడైపోతుంది. పిండి ఎప్పుడూ పొడిగానే ఉండాలి. అలా కాకుండా.. కాస్త చిన్న తడి చుక్క తగిలినా వెంటనే పురుగులు పట్టడం మొదలౌతుంది. మామూలుగానే పిండి.. పురుగులను ఆకర్షిస్తుంది. ఒక్కసారి పురుగులు వస్తే.. ఆ పిండిని తినకుండా ఉండటమే మంచిది. దానికి దూరంగా ఉండాలి.
పిండిని స్టోర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలుతురు తగలకుండా... గాలి తగలకుండా.. ఉండే కంటైనర్ ఎంచుకోవాలి. దాని వల్ల పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా సహాయపడుతుంది.
పిండిని నిల్వ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన దశ ఏమిటంటే అది వచ్చిన అసలు బ్యాగ్ నుండి గాలి చొరబడని ఆహార నిల్వ కంటైనర్‌లోకి తీసుకెళ్లడం. ఈ రకమైన కంటైనర్ తేమ , దోషాలు దూరంగా ఉండేలా చేస్తుంది. మీ పిండిని 10 నెలల వరకు పాడవ్వకుండా తాజాగా ఉంచుతుంది.
refined flour
మీ పిండిని చీకటి , పొడి వాతావరణంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఇక సాధారణంగా ఎవరైనా పిండి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే.. కట్ చేసి కంటైనర్ లో పెడుతూ ఉంటారు. దానిపై కవర్ ఉండదు కాబట్టి.. ఎక్స్ పైరీ డేట్ మనకు తెలీదు. అలా కాకుండా.. కంటైనర్ పైన అయినా.. దాని ఎక్స్ పైరీ డేట్ రాసుకొని ఉంచుకోవాలి. దాని వల్ల.. ఆ పిండిని ఎంత కాలం వాడొచ్చు అనే అవగాహన మనకు కూడా ఉంటుంది.
Image: Freepik
మీ పిండిని నిల్వ చేయడానికి , తాజాగా ఉండేలా చూసుకోవడానికి మీ పిండిని వాక్యూమ్ సీలింగ్ చేయడం మరొక గొప్ప ఎంపిక. ఈ పద్ధతి రెండు సంవత్సరాల వరకు పిండి బాగా ఉండేందుకు సహాయపడుతుంది.