అరటి పండ్లు 15 రోజులైనా తాజాగా ఉండాలంటే ఏం చేయాలి..?

First Published | Mar 27, 2024, 1:46 PM IST

అలా నల్లమచ్చ వచ్చిన తర్వాత అరటి పండు తినాలని అనిపించదు. మరి.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అరటి పండ్లు ఎక్కువ రోజులు అంటే.. దాదాపు 15 రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

మనకు మార్కెట్లో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. వాటిలో అందరికీ అందుబాటులోనూ, చౌకగానూ అరటిపండ్లు లభిస్తాయి. ధర తక్కువ అయినా.. అరటి పండుతో మనకు కలిగే లాభాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.  అరటి పండులో చాలా పోషకాలు ఉంటాయి. మన మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.
 

Fruits

అయితే.. అరటి పండ్లతో వచ్చిన సమస్య ఏమిటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అన్ని పండ్లలాగా వీటిని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయలేం. బయట ఉంచితే.. రెండు రోజులకే పైన నల్ల మచ్చలు రావడం మొదలౌతాయి. అలా నల్లమచ్చ వచ్చిన తర్వాత అరటి పండు తినాలని అనిపించదు. మరి.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అరటి పండ్లు ఎక్కువ రోజులు అంటే.. దాదాపు 15 రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Latest Videos


banana

మార్కెట్లో విటమిన్ సి ట్యాబ్లెట్స్ లభిస్తాయి. వాటిని కనుక నీటిలో కరిగించి.. ఆ నీటిలో అరటి పండు కాడలను ముంచితే..లేదంటే.. ఆ నీటిలో ఉంచినా.. రెండు వారాలైనా పండ్లు తాజాగానే ఉంటాయి. మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో.. 15 రోజులకు కూడా అలానే ఉంటాయి.

మామూలు నీటిలో ఉంచినా కూడా అరటి పండ్లు తాజాగానే ఉంటాయి. అరటి పండు చివరి కొన నీటిలో తగిలేలా ఉంచితే చాలు.. దాదాపు 15 రోజులు తాజాగా ఉంటాయి.
 


లేదంటే..అరటి పండ్లను.. మైనం పూసిన కాగితంలో చుట్టి ఉంచినా కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కొంచెం కూడా మెత్తపడటం, రంగు మారటం లాంటివి జరగవు.
 

ఇది కూడా కాదు అంటే.. మీరు తెచ్చిన తాజా అరటి పండ్లపై కొద్దిగా నిమ్మరసం చల్లాలి. ఇలా నిమ్మరసం చల్లడం వల్ల... అరటి పండ్లు బ్రౌన్ కలర్ లో మారకుండా తాజాగా ఉంటాయి.

banana

ఇలా కాదు అంటే.. మీరు అరటి పండ్లను ముందుగానే ముక్కలుగా కోసుకొని.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. అలా చేయడం వల్ల కూడా ఎక్కువ రోజులు మనం అరటి పండును ఆస్వాదించవచ్చు.

click me!