ఆపిల్ ఫ్రైస్ ఇంట్లో సింపుల్ గా తయారుచేసుకునే స్నాక్స్. వీటిని చక్కగా నూనెలో వేయించి దాల్చినచెక్క పొడి, చక్కెరతో కోటింగ్ వేస్తే అదిరిపోతుంది.
బర్త్ డే పార్టీ లేదా పిక్నిక్ కోసం చక్కటి చిరుతిండిగా పనిచేస్తుంది. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే.. ఈ ఆపిల్ ఫ్రైస్ మంచి ఆఫ్షన్. వీటిని కారామెల్ డిప్‌తో, కొంచెం ఉప్పగా ఉండి పంచ్‌తో మీకు మంచి టేస్ట్ ను ఇస్తాయి.
ఆపిల్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు4 పెద్ద ఆపిల్స్1 టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడి12 కప్పు వెజిటబుల్ ఆయిల్12 కప్పు చక్కెర12 కప్పు కార్న్ ఫ్లోర్
ఆపిల్ ఫ్రైస్ తయారు చేసే విధానం..ముందుగా ఆపిల్స్ ను తొక్క తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. దీనివల్ల అన్నిముక్కలు సరిగ్గా ఉడుకుతాయి.
ఆపిల్ ఫ్రైస్ తయారు చేసే విధానం..ముందుగా ఆపిల్స్ ను తొక్క తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. దీనివల్ల అన్నిముక్కలు సరిగ్గా ఉడుకుతాయి.
ఒక గిన్నె లో కార్న్ ఫ్లోర్ తీసుకుని దీంట్లో ఆపిల్ ముక్కలు కోట్ చేసి పెట్టుకోవాలి.
మరో గిన్నెలో దాల్చినచెక్కపొడి, చక్కెరలు వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి.
ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడి చేసి, ఆపిల్‌లను బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించండి.
తరువాత ముక్కల్ని తీసి టిష్యూ పేపర్ మీద వేసి ఎక్కువైన నూనెను తీసేయాలి. తరువాత ఆపిల్ ముక్కలను చక్కెర, దాల్చినచెక్క మిశ్రమంలో కోట్ చేసి, కారామెల్ డిప్, ఐస్ క్రీం విప్ డ్ క్రీమ్ తో సర్వ్ చేయండి.