మునగాకుతో ఒత్తైన, నిగనిగలాడే తలకట్టు.. ఇలా ట్రై చేస్తే బెస్ట్..

First Published Jun 19, 2021, 3:11 PM IST

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో  ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో-ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి. 

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో-ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి.
undefined
దీన్లోని ఈ పోషకవిలువలే జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మునగలో ఉండే పేటరీగోస్పెర్మిన్ చుండ్రు, దురద చర్మం, సోరియాసిస్, తామర, బాక్టీరియా వల్ల వచ్చే పొక్కులను నివారించడంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది.
undefined
జుట్టు డి-పిగ్మెంటేషన్ అవ్వడాన్ని ఆలస్యం చేస్తుంది. మునగలో ఉండే ఒక నిర్దిష్ట పెప్టైడ్ హెయిర్ షాఫ్ట్ చుట్టూ పూతలా ఏర్పడి.. జుట్టు త్వరగా తెల్లబడడాన్ని అరికడుతుంది.
undefined
మునగలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ సి లో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల జుట్టు రంగుకు ముఖ్యమైన మెలనిన్ వర్ణద్రవ్యం కోల్పోవడం ఆలస్యం అవుతుంది.
undefined
మోరింగాలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కణాలను నిర్మిస్తుంది. అందువల్ల ఇది జుట్టును పునరుజ్జీవింపచేయడానికి సహాయపడుతుంది. అలోపేసియాను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను చురుకు చేస్తుంది. తద్వారా బట్టతల మీద కూడా జుట్టు పెరుగుతుంది.
undefined
మునగలో బయోటిన్ అధిక మొత్తంలో ఉంటుంది. బయోటిన్ వల్ల ఆర్‌బిసిల ఉత్పత్తి పెరిగి.. మీ మాడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది జుట్టు టెలోజెన్ దశను ఆలస్యం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు కణాల దీర్ఘాయువుని పెంచుతుంది.
undefined
మునగలో ఒమేగా -3 ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు మందంగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు మునగాకు పేస్టును పెట్టినప్పుడు వెంట్రుకలకు కోటింగ్ లా పనిచేసి.. కార్టెక్స్ లోని రంధ్రాలను మూసేస్తుంది. దీనివల్ల జుట్టు పోషణను కోల్పోకుండా ఉంటుంది. తేమను పట్టి ఉంచుతుంది.
undefined
మునగలో అధికంగా ఉండే జింక్, విటమిన్ ఎ, ఇనుము ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. జింక్ తలలోని నూనె గ్రంథులను ఆరోగ్యంగా, పోషకంగా ఉంచుతుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.
undefined
కొబ్బరి నూనె, ఆముదపు నూనెతో కలిపి మునగపొడిని వాడొచ్చు.
undefined
హెయిర్ ప్యాక్ : పెరుగు, రోజ్ వాటర్, రైస్ వాటర్ లతో మునగపొడిని కలిపి ప్యాక్ గా ఉయోగించొచ్చు.
undefined
హెయిర్ టోనర్ : మోరింగా ఆకును నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని స్ప్రేగా ఉపయోగించడం కూడా చాలామంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మునగాకు రసం తాగడం కూడా మంచిదే.
undefined
జుట్టు, చర్మానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాహారం సరిగా అందాలంటే సరైన, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.
undefined
click me!