ప్రతిరోజూ వంట చేయడం తప్పనిసరి. తక్కువలో తక్కువ మూడుసార్లైనా రోజులో వంట చేయాల్సి వస్తుంది. వాటిలో తేలిక అయిపోయేవి కొన్ని ఉంటే.. గంటల కొద్ది సమయం పట్టేవి మరికొన్ని ఉంటాయి. ఎంత సమయం పట్టినా.. కడుపు నిండాలంటే వండుకోవాల్సిందే కదా. అలా వంట చేసే సమయంలో.. స్టవ్ సమీపంలో నూనె మరకలు పడే అవకాశం ఉంటుంది.
అంతేనా.. కిచెన్ లోని కప్ బోర్డ్స్ అన్నీ.. మురికి మురికిగా తయారౌతాయి. ఎంత క్లీన్ చేసినా పోకుండా.. గ్రీజు అంటినట్లుగా తయారౌతాయి. అయితే.. అలాంటి కిచెన్ ని కూడా సింపుల్ ట్రిక్స్ తో అద్దంలా మెరిసిపోయేలా చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
వారానికి ఒకసారి.. నెలకి ఒకసారి తుడిస్తే.. కిచెన్ అలా అద్వాన్నంగానే ఉంటుంది. కాబట్టి వంట పూర్తైన వెంటనే.. ఒక పొడి గుడ్డతో.. వీలైనంత వరకు తుడిచేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేసి ఓ శుభ్రమైన గుడ్డతో తుడిచేయాలి. దీనికి పెద్దగా ఐదు నిమిషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు
కొందరికి మూసివేసిన కప్ బోర్డ్స్ కాకుండా.. తెరచి ఉండేవి కూడా ఉంటాయి. అలాంటి వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చట. కొన్నిసార్లు డబ్బాల్లోని పిండి, కారం లాంటివి కూడా కప్ బోర్డ్స్ లో పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సోప్ వాటర్ తో దానిని శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే.. ఎక్కువ శ్రమ ఉండదు.. ఎప్పటికప్పుడు శుభ్రంగా కనిపిస్తాయి.
ఒక డబ్బాలో నీరు తీసుకొని దాంట్లో కొద్దిగా వెనిగర్, సోడా, వాషింగ్ పౌడర్ వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి ఒకసారి శుభ్రం చేస్తే.. చాలా కొత్తగా కనిపిస్తాయి.
ఇక నెలకి ఒకసారి.. కప్ బోర్డ్స్ లో వేసిన పేపర్స్ మార్చుకోవాలి. పాత పేపర్లు తీసి.. కొత్తవి వేయాలి. ఇలా చేయడం వల్ల కప్ బోర్డ్స్ ఎప్పటికప్పుడు కొత్తగా శుభ్రంగా కనిపిస్తాయి.
నూనె మరకలు ఎక్కువగా ఉంటే.. ఆ ప్రదేశంలో వేడిలో సోప్ మిశ్రమాన్ని కలిపి వేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితో శుభ్రమౌతుంది. ఎలాంటి మరకలైనా పోతాయి.