కరోనాతో పోరాడుతున్నారా..? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

First Published | May 4, 2021, 11:14 AM IST

ఇప్పటి వరకు విటమిన్లు, మినరల్స్, విటమిన్ డి, విటమిన్ సీ, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇది మాత్రమే కాదు...కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా పేరే వినపడుతోంది. ఈ మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ కనీసం మూడు లక్షల కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి నుంచి కోలుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారు ఏం తినాలో చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే.. ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు విటమిన్లు, మినరల్స్, విటమిన్ డి, విటమిన్ సీ, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇది మాత్రమే కాదు...కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. మీరు కరోనా నుంచి కోలుకున్నా... ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నా.. ఈ ఆహారం వీలైనంత దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్యాకేజ్డ్ ఫుడ్స్... వీటికి చాలా దూరంగా ఉండాలి. వీటి వల్ల ఉపయోగాలకన్నా.. నష్టాలే ఎక్కువగా ఉంటాయి. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కరోనా నుంచి కోలుకోవడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. దూరంగా ఉండటం మంచిది.
స్పైసీ ఫుడ్స్..కారం, ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి తినడం వల్ల గొంతులో ఇరిటేషన్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. దాని వల్ల దగ్గు ఎక్కువౌతుంది.
కాబట్టి.. ఎర్రమిరపకాయల పొడికి దూరంగా ఉండాలి. దాని బదులు మిరియాల పొడిని ఉపయోగించడం మంచిది. మిరియాల పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇది మేలు చేస్తుంది.
నూనెలో వేయించిన పదార్థాలు..నూనెలో వేయించిన పదార్థాలు తినకూడదు. దీని వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. తెలీకుండా ఎక్కువగా తినేస్తాం. దీని వల్ల అనారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. అరుగుదల సమస్యలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
షుగర్ డ్రింక్స్..షుగర్ కంటెంట్ ఉండే కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కావాలంటే ఇంట్లోనే నిమ్మకాయ రసం, కొబ్బరి నీరు లాంటివి తాగడం మంచిది.

Latest Videos

click me!