ఏ వంటకు ఏ నూనె వాడాలి..? డీప్ ఫ్రై తర్వాత మిగిలిన నూనె ఏం చేయాలి?

First Published Jul 24, 2024, 2:10 PM IST

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిదా లేక.. రీఫైన్డ్ ఆయిల్స్ మంచిదా అనే విషయం కూడా తెలీదు.   మరి, దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

cooking oil


వంట చేయాలి అంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి..? నూనె. ఏ ఒకటో, రెండో వంటలు మినహాయించి.. దాదాపు ఏది వండాలన్నా నూనె ఉండాల్సిందే. ఎంత క్వాంటిటీ నూనె వాడుతున్నాం అనేది చేసే వంటని బట్టి ఉంటుంది. వేయించే ఆహారాల నుంచి సాటింగ్ వరకు ఏదో ఒక రకం నూనె వాడాల్సిందే. నూనె వంటకు మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు దానిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అయితే.. వంట చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో నూనె వాడతారు. మార్కెట్ కి వెళ్లినా మనకు కూడా పదుల రకాల నూనెలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో మనకు ఓ అవగాహన ఉండదు. టీవీల్లో యాడ్స్ చూసి.. తెలిసిన పేరుతో ఉన్న నూనెను కొనేస్తూ ఉంటాం. వాటిల్లోనూ శెనగ నూనె, నువ్వుల నూనె, పామాయిల్, ఆలివాయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్   అంటూ చాలా రకాల నూనెలు ఉంటాయి. కానీ.. ఏ నూనె ఏ వంటకు వాడాలో చాలా మందికి అవగాహన ఉండదు.అంతెందుకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిదా లేక.. రీఫైన్డ్ ఆయిల్స్ మంచిదా అనే విషయం కూడా తెలీదు.   మరి, దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

Latest Videos


Cooking oil

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వర్సెస్ రిఫైండ్: ఏది బెటర్?కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఎంచుకునే విషయంలో అది మీ వంట ప్రయోజనంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. మన వంటకు ఎలాంటి నూనె వాడాలో తెలియనివాళ్లు.. ఈ కింది చిట్కాలతో వంట నూనెను ఎంచుకోండి.
 

నిపుణుల ప్రకారం.. మీరు మీ రోజువారి వంటకోసం, సాటింగ్ కోసం.. వేటికైనా రెగ్యులర్ ఇంట్లో చేసే వంట కోసం అయితే.. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. అవి శుద్దిచేసిన నూనెలకంటే ఆరోగ్యానికి చాలా మంచివి. అదే.. మీరు ఇంట్లో ఏదైనా వంట డీప్ ఫ్రై చేస్తున్నట్లయితే.. దానికి మాత్రం కోల్డ్ ప్రెస్డ్ నూనె వాడకూడదు.  ఈ నూనెలో ఫుడ్ డీప్ ఫ్రై చేస్తే.. అది అనారోగ్యానికి దారితీస్తుంది.


2. డీప్ ఫ్రైయింగ్ మీరు షాలో ఫ్రై లేదా డీప్ ఫ్రై చేయాలనుకుంటే,  శుద్ధి చేసిన నూనె అంటే.. రిఫైన్డ్ ఆయిల్స్  ను ఉపయోగించండి. చాలా మంది శుద్ధి చేసిన నూనెలను అనారోగ్యకరమైనవిగా భావిస్తారు కాబట్టి ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. అయినప్పటికీ, శుద్ధి చేసిన నూనెల  మరిగే స్థానం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల లోతైన వేయించడానికి , అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి సరిపోతుంది.అంటే.. ఏ నూనె ఎంచుకోవాలి అనేది.. మనం చేసే వంట మీద ఆధారపడి ఉంటుంది. 


ఇక మిగిలిపోయిన వంటను తిరిగి ఉపయోగించే విషయంలోనూ చాలా మందికి అనుమానాలు ఉంటాయి. దాని గురించి కూడా నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

నిజానికి ఆరోగ్య నిపుణులు చెప్పిన సూచనల ప్రకారం...ఒకసారి డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్లీ వాడకపోవడమే మంచిదట. మహా అంటే... ఆ నూనెను రెండుసార్లు వేడి చేసి వాడుకోవచ్చు. కూరల్లోకి, సాటింగ్ లోకి కూడా వాడకూడదు అని చెబుతున్నారు. కానీ.. మనవి మధ్యతరగతి జీవితాలు.. ఒక్కసారి ఏ గారె, పూరీ చేశాం కదా అని నూనె మొత్తం పారబోయలేం. అయితే... చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఒక నెల రోజుల్లో ఆ నూనెను తిరిగి వాడుకోవచ్చట. అదెలాగంటే. .. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ నూనె చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు ఆ నూనె కాస్త చల్లారే వరకు వేయి ఉంచాలి. చల్లారిన తర్వాత.. ఆ నూనెలో గతంలో వేయించిన ఫుడ్ పలుకులు ఏమైనా ఉంటే.. అవి రాకుండా నూనెను వడబోసుకోవాలి. ఇప్పుడు గాలి తగలని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని నెల రోజుల్లో ఉపయోగించుకోవచ్చు. అది కూడా డీప్ ఫ్రైకి కాకుండా.. నార్మల్ వంట్లో వాడటం ఉత్తమం. 

click me!