వర్షాకాలం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే... ఎండాకాలం వేడి తగ్గుతుంది.. వాతావరణం హాయిగా ఉంటుంది.. కాబట్టి వర్షాకాలం నచ్చేస్తుంది. కానీ... వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మారుతున్న వాతావరణంలో.. జ్వరం, జలుబు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే.. వర్షాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యాధులు త్వరగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అదే సమయంలో, రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే.. కచ్చితంగా.. వర్షాకాలంలో ప్రతిరోజూ ఒక స్పూన్ తేనె తీసుకోవాల్సిందే. అలా తీసుకోవడం వల్ల.. కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం....
తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది.
ఇది జలుబు , దగ్గును నివారించడంలో కూడా సహాయపడుతుంది.
తేనెలో ప్రీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. ప్రతి రోజు 1 టీస్పూన్ తేనె తినడం వల్ల వర్షాకాలంలో జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
మీరు బరువు తగ్గాలనుకునేవారైనా, తేనెను తీసుకోవడం ప్రయోజనకరం.
తేనెలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది సీజనల్ వ్యాధులు , ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.
ప్రతిరోజూ 1 టీస్పూన్ తేనె తింటే బలహీనత తొలగిపోయి శరీరానికి బలం చేకూరుతుంది.
తేనె ఎలా తీసుకోవాలో తెలుసా..?
వర్షాకాలంలో మీరు తేనెను మీ ఆహారంలో అనేక రకాలుగా చేర్చుకోవచ్చు.
బరువు తగ్గడానికి, 1 టీస్పూన్ తేనెను నీటిలో కలిపి తినండి.
దగ్గు నుండి విముక్తి పొందడానికి, రాత్రిపూట 1 టీస్పూన్ తేనెను నల్ల మిరియాలు కలిపి తినండి.
వర్షాకాలంలో ఎండు శొంఠి పొడిని 1 టీస్పూన్ తేనెతో కలిపి తినడం కూడా ప్రయోజనకరం.
ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఖాళీ కడుపుతో తేనెను తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.