పండు మాత్రమే కాదు బొప్పాయి గింజలు కూడా మంచివే.. వీటిని ఇలా తింటే చాలా మంచిది

Published : Aug 22, 2025, 03:31 PM IST

బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అయితే మనలో ప్రతి ఒక్కరూ ఈ పండును తినేటప్పుడు దాని గుజ్జును తినేసి గింజల్ని పారేస్తుంటారు. కానీ ఈ గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలిస్తే అస్సలు పారేయరు.

PREV
16
బోప్పాయి గింజలు

మనలో చాలా మంది బొప్పాయి పండును తరచుగా తింటుంటారు. కానీ దాని విత్తనాల్ని మాత్రం పారేస్తుంటారు. ఎందుకంటే అవి దేనికీ పనికిరావని. కానీ ఈ పండు గుజ్జుతో పాటుగా దాని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవును చిన్న నల్ల విత్తనాలు మనం బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అసలు బొప్పాయి గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
బొప్పాయి విత్తనాల ప్రయోజనాలు

బలమైన జీర్ణవ్యవస్థ

మలబద్దకం, అపానవాయువు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలున్న వారికి బొప్పాయి విత్తనాలు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. అవును ఈ విత్తనాల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను బాగా విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో తిన్నది బాగా అరుగుతుంది. మీరు గనుక ఈ విత్తనాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ బలంగా అవుతుంది. కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

36
శోథ నిరోధక ప్రయోజనాలు

గుండె జబ్బులు లేదా ఆర్థరైటిస్ వంటి ఎన్నో రోగాలకు మంట సాధారణ కారణం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి సమాయపడతాయి. అలాగే ఈ విత్తనాల్లోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ రెండూ వాపు, చికాకును తగ్గించడానికి సహాయపడతాయి.

46
కాలేయం, మూత్రపిండాలకు రక్షణ

బొప్పాయి విత్తనాలు మూత్రపిండాలు, కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాల, కాలెయం పనితీరును మెరుగుపరుస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాలెయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి ఈ గింజలు కాపాడుతాయి. అలాగే కాలెయ సిరోసిస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా రావు.

56
పేగులో పురుగులను తొలగిస్తాయి

కడుపులో నులి పురుగులు ఉండటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా ఇవి చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి ఎవ్వరికైనా ఉండొచ్చు. అయితే బొప్పాయి గింజలు ఈపురుగులను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ గింజల్లో 'కార్పీన్' అనే మూలకం ఉంటుంది. దీనిలో ఉండే యాంథెల్మింటిక్ లక్షణాలు కడుపు పరాన్నజీవులు, పురుగులను ప్రభావవంతంగా తొలగిస్తాయి. అందుకే వీటిని నేటికీ సాంప్రదాయ వైధ్యంలో ఉపయోగిస్తారు

66
బొప్పాయి విత్తనాల్ని ఇలా తినాలి

బొప్పాయి విత్తనాలు కొంచెం చేదుగా ఉంటాయి. వీటిని మీరు పండు నుంచి నేరుగా తినేయొచ్చు. అలాగే వీటిని బాగా ఎండబెట్టి పొడి చేసి తినొచ్చు. ఈ పొడిని మీరు ఓట్ మీల్, స్మూతీలు, సలాడ్ లో కలుపుకుని తినొచ్చు. అయితే మొదట్లో వీటిని కొన్ని మాత్రమే తినాలి. ఏదైనా కొత్త చికిత్సను స్టార్ట్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories