ఇతర కాలాలతో పోలిస్తే.. సమ్మర్ లో బరువు తగ్గడం కాస్త సులువు అనే చెప్పొచ్చు. అందుకే.. చాలా మంది బరువు తగ్గడానికి వేసవి కాలాన్ని ఎంచుకుంటారు. అయితే... మనం ఎప్పుడు బరువు తగ్గాలి అనుకున్నా కూడా అది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు.. వాళ్లు తినే దానికంటే... ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.
బరువు తగ్గానికి, మీరు ఆశించిన ఫలితాలను సమర్థవంతంగా పొందడంలో సహాయపడే ఆహారాలు, పానీయాలు మన డైట్ లో చేర్చుకోవాలి. వాటిలో పప్పులు బెస్ట్ అని చెప్పొచ్చు. మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు కానీ.. పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడటమే కాదు సులభంగా బరువు త్గగలం. ఈ పప్పులతో బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...
1. ప్రోటీన్ కి మంచి మూలం..
బరువు తగ్గాలి అనుకుంటే.. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి. ఆ ప్రోటీన్ మనకు పప్పుల ద్వారా పుష్కలంగా లభిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీరు తక్కువ తినవచ్చు, ఫలితంగా బరువు తగ్గుతారు. పప్పుధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం. కాబట్టి.. మీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
pulses
2.ఫైబర్...
ప్రోటీన్ లాగానే, ఫైబర్ కూడా మీ జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అధిక ఫైబర్ ఆహారాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
3. తక్కువ కేలరీలు..
ప్రోటీన్ , ఫైబర్ మంచి మూలం అయినప్పటికీ, పప్పులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు పప్పులను ఉపయోగించి సలాడ్, లేదా కూర లేదా కట్లెట్స్ లాంటివి చేసుకోవచ్చు.
పప్పులు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
పప్పులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, బరువు తగ్గడానికి దోహదపడతాయి, పప్పులను ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యకరమైన రక్తపోటును కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది పప్పులు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, అవి మొక్కల ప్రోటీన్‌కు మంచి మూలం, మీరు పప్పులతో ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్ధారించవచ్చు. కాబట్టి... ఈ సమ్మర్ లో మీ డైట్ లో పప్పులను భాగం చేసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చు.