వయసును బట్టి రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో తెలుసా?

First Published | Aug 4, 2024, 10:25 AM IST

బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వీటిని రోజుకు ఎన్ని తినాలో తెలుసా? 
 

almonds

ఎదిగే పిల్లలతో పాటుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో బాదం పప్పులను ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వేరే డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే బాదం పప్పుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదం పప్పులను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం, కాపర్, నియాసిన్, ఐరన్, మెగ్నీషియం లోపం తగ్గుతుంది. బాదం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. వీటిని ఎక్కువగా తిన్నా లేదా సరిగ్గా తినకపోయినా హాని కలుగుతుంది. 
 

మన శారీరక అవసరాల కంటే తక్కువగా బాదం పప్పులను తింటే దాని ప్రయోజనాలను పొందలేరు. అలాగే అవసరానికి మించి ఈ పప్పులను తిన్నా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వయసును బట్టి ఒక వ్యక్తి రోజుకు ఎన్ని బాదం పప్పును తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


badam

పెద్దలు రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?

ఆరోగ్య నివేదికల ప్రకారం.. వయోజన వ్యక్తి రోజుకు 30 గ్రాములు, అంటే 23 బాదం పప్పులను తినాలని సలహానిస్తారు. వయోజన వ్యక్తి శరీరానికి అవసరమైన అన్ని పోషకాల పరిమాణాన్ని తీర్చడానికి ఈ మొత్తంలో బాదం పప్పులు సరిపోతాయి.  పెద్దవాళ్లు బాదం పప్పులను అంత మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు.
 

నిపుణులు ఏమంటున్నారంటే...

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం వంటి వేడి ఎక్కువగా ఉండే దేశంలో.. ఒక వ్యక్తి రోజుకు 4-5 నానబెట్టిన బాదం కంటే ఎక్కువ తినకూడదు. బాదం పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె, మెదడు సమస్యలు, చర్మం, జుట్టు ఆరోగ్యం, మధుమేహం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే బాదం పప్పులను ఎక్కువగా తింటే మలబద్ధకం, చర్మవ్యాధులు, అధిక చెమట వంటి సమస్యలు వస్తాయి. 

బరువు తగ్గడానికి..

ఒక అధ్యయనంలో.. బాదం తినని వారి కంటే బాదం తినే వ్యక్తులు వేగంగా బరువు తగ్గుతారని కనుగొన్నారు. ఎందుకంటే బాదంలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బాదంలో ఉండే మోనోశాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బాదంలో ఉండే ప్రోటీన్ కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మీ బరువును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.


పిల్లలు రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? 

పిల్లలు రోజుకు 10 బాదం పప్పులు తింటే సరిపోతుంది. రోజూ 10 బాదం పప్పులను నానబెట్టి పిల్లలకు తినిపించడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. బాదం పూర్తి ప్రయోజనాలను పొందడానికి మీరు వీటిని పచ్చిగా కూడా తినొచ్చు. లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు. 
 

Latest Videos

click me!