డయాబెటీస్ ఉంటే ఈ డ్రై ఫ్రూట్స్ ను తినొద్దు

First Published | Aug 3, 2024, 3:29 PM IST

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను డయాబెటీస్ ఉన్నవారు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అవేంటంటే.. 
 

హెల్తీ డైట్ లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ను తినాలి. డ్రై ఫ్రూట్స్ లో మనల్ని హెల్తీగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం  కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినకపోవడమే మంచిది. అవును కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఫాస్ట్ గా పెంచుతాయి. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరగకూడదనుకుంటే మధుమేహులు ఏయే డ్రై ఫ్రూట్స్ ను తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఎండుద్రాక్ష

డయాబెటీస్ ఉన్నవారు మర్చిపోయి కూడా ఎండుద్రాక్షను తినకూడదు. నిజానికి ఈ ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయి. కానీ వీటిలో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఎండుద్రాక్షలకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్తారు. 
 


ఖర్జూరం 

చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు సహజ చక్కెరల కోసం ఖర్జూరాలను ఎక్కువగా తింటుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మత్తుగా పెరుగుతుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లు ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. 
 

అంజీర్

అంజీర పండ్లలో నేచురల్ షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా తొందరగా పెంచుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లను తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. 

cranberry

క్రాన్బెర్రీ

డ్రై క్రాన్బెర్రీలు ఆడవాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే ఈ పండ్లు మూత్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి బాగా సహాయపడతాయి. కానీ ఈ పండ్లను ఎక్కువగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 
 

Latest Videos

click me!