మాంసాహార ప్రియులు ప్రతిరోజూ నాన్ వెజ్ తినాలని అనుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మాంసాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ బి 1 నుండి బి 12, విటమిన్ సి, భాస్వరం, కాల్షియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు మరిన్నింటిని అందిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాంసం అవసరం.
మంచి శుభ్రమైన మాంసం తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నట్లు.. చెడు మాంసం తింటే నష్టాలు కూడా ఉన్నాయి. అనారోగ్యమైన మాంసాన్ని తీసుకుంటే.. అది మన ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా?
మాంసం నుండి అన్ని పోషకాలను పొందడం అవసరమే అయితే.. దాని వల్ల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, మాంసం కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మాంసం షాపింగ్ విషయానికి వస్తే మీరు గుర్తుంచుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
1. మాంసం కొనేటప్పుడు ముందుగా దాని నాణ్యత చెక్ చేయాలి. నాణ్యతను అంచనా వేసేటప్పుడు మాంసం ఎలా ఉందో చూడండి. కత్తిరించేటప్పుడు రెడ్ మీట్ నీరు లేదా పసుపు రంగులో ఉండకూడదు. అది ఎముకల నుండి పడకూడదు. మాంసంలో పసుపు లేదా నీటి కంటెంట్ ఉంటే, మాంసం తాజాగా లేదు అని అర్థం చేసుకోవాలి.
2.ఇక చికెన్ విషయానికి వస్తే.. మజిల్ ఫైబర్స్ స్పష్టంగా కనపడేలా ఉండాలి. చికెన్ పై భాగం చాలా మృదువుగా ఉండాలి. పొడిగా ఉండాలి. పలచగా ఉండకూడదు. చికెన్ మాంసం కట్ చేసే సమయంలో పారదర్శకంగా లేకపోతే.. అది తాజాగా ఉన్నట్లు కాదని తెలుసుకోవాలి.
3. మీరు రంగును చూసి కూడా ఆ మాంసం తాజాదనం గురించి తెలుసుకోవచ్చు. కత్తిరించినప్పుడు రెడ్ మీట్ ఎరుపు రంగులో ఉండాలి. ఫ్రీజ్ చేసిన మాంసం అయితే.. అది కొద్దిగా గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇది కొనడం సురక్షితం మరియు రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు నిల్వ చేయవచ్చు.
4.చికెన్ విషయానికి వస్తే, మాంసం లేత గులాబీ లేదా తెలుపు రంగులో ఉండాలి. కోడి కొనేటప్పుడు ఉపరితలంపై గాయాలు లేదా రక్తం గడ్డకట్టడం లాంటివి ఉండకూడదు.
5.మాంసం మంచిగానే ఉందా.. లేదా కుళ్లిపోయిందా అనే విషయాన్ని ముందుగా వాసన ద్వారా గుర్తించవచ్చు. వాసన వస్తున్న మాంసాన్ని ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. నార్మల్ గా వచ్చే వాసన కన్నా భిన్నమైనది వస్తే.. అది మంచిగా లేదని అర్థం చేసుకోవాలి.