చాలా మంది భోజనం చేసిన తర్వాత గ్యాస్ వచ్చేసిందని.. కడుపులో మంటగా ఉంది.. ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. అలా అవ్వడానికి వారు తీసుకునే ఆహారమే కారణమని ఎప్పుడైనా ఆలోచించారా..? మీరు చదివింది నిజమే. కొన్ని రకాల ఆహారాలను రాత్రి పడుకునేముందు తినకూడదు. దాని వల్ల ఉపయోగం కన్నా.. హానే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
రాత్రిపూట అసలు ఎక్కువగా తినడం అసలు మంచిది కాదు. ఎందుకంటే రాత్రి వేళ అరుగుదల ఆలస్యంగా ఉంటుంది. కాబట్టి ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఎక్కువ స్పైసీ ఉండే ఆహారం రాత్రి పూట తినకుండా ఉండటమే మంచిది. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యంగానూ ఉంటారు.. తీసుకున్న ఆహారం కూడా తొందరగా అరుగుతుంది.
జంక్ ఫుడ్స్, ఎక్కువగా గ్రిల్ చేసినవీ, నూనెలో వేగినవి ఎక్కువగా తినకూడదు. మరీ ముఖ్యంగా బయటి ఫుడ్స్ కి చాలా దూరంగా ఉండాలి.
ఇక నాన్ వెజ్ కూడా రాత్రిపూట త్వరగా అరగదు. కాబట్టి రాత్రి పూట మాత్రం వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది.
స్వీట్ కార్న్, లేదా హెవీ ఫుడ్స్ కూడా రాత్రి పూట తినడం మంచిది కాదు. ఇవి ఎక్కువగా తీసుకుంటే గుండెలో మంట లాంటివి వచ్చే అవకాశం ఉంది.