2.ఓట్ మీల్ బ్లూబెర్రీ ప్యాన్ కేక్స్..
ప్యాన్ కేకులను ఓట్స్ తోనూ హ్యాపీగా తినొచ్చు. ఇందులో... యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటితో రోజూ మొదలుపెడితే.. ఆ రోజు చాలా హెల్దీగా ఉంటుంది. దాని కోసం మనం...సాధారణంగా చేసే ప్యాన్ కేక్ లో పిండికి బదులు... ఓట్స్ ని పౌడర్ ని వాడితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఇప్పుడు అందులో ఒక కోడిగుడ్డు, ఒక కప్పు బాదం పాలు వేసి.. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో బ్లూబెర్రీలు కలుపుకొని.. ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. రుచి అదిరిపోతుంది.. మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ కూడా అవుతుంది.