చలికాలంలో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదు..!

First Published | Dec 6, 2023, 2:15 PM IST

ఈ కాలంలో మనం ఎక్కువగా రోగాల బారినపడుతూ ఉంటాం. ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయో ఊహించలేం. ఈ కాలంలోనూ ఆరోగ్యంగా ఉండాలి అంేట, మనం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. మరి, ఎలాంటి ఆహారం తీసుకుంటే, మనం ఆరోగ్యంగా ఉంటామో చూద్దాం..


చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎక్కువ మనకు వేడి , స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి, వేడిగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతాం. అయితే,  ఈ కాలంలో మనం ఎక్కువగా రోగాల బారినపడుతూ ఉంటాం. ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయో ఊహించలేం. ఈ కాలంలోనూ ఆరోగ్యంగా ఉండాలి అంేట, మనం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. మరి, ఎలాంటి ఆహారం తీసుకుంటే, మనం ఆరోగ్యంగా ఉంటామో చూద్దాం..

1.షుగరీ ఫుడ్స్..
చాలా మందికి స్వీట్స్, కేక్స్ లాంటివి తినడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాదు, చలికాలంలోనూ కూల్ డ్రింక్స్ తాగేవారు కూడా ఉంటారు. అయితే,  చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఏదైనా అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.
 


2. వేయించిన ఆహారం

వేయించిన ఆహారం వేడి వేడిగా తింటే చాలా రుచిగా, కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వేయించిన ఆహారం అస్సలు తినకూడదు. వేయించిన ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి ఇది హానికరం. 
 

3. హిస్టామిన్ అధికంగా ఉండే ఆహారాలు

 గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు , పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు అందరికీ సెట్ అవ్వవు. కాబట్టి, అలర్జీ లాంటివి ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.
 

4.పాల ఉత్పత్తులు

గొంతునొప్పి, దగ్గు లేదా జలుబుతో బాధపడుతున్నప్పుడు పాల ఉత్పత్తులను తీసుకోవద్దని వైద్యులు సాధారణంగా సూచిస్తున్నారు. పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు  అనారోగ్యాలను మరింత తీవ్రతరం చేస్తాయి.


5.కెఫిన్ పానీయాలు

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్  ఇతర రకాల పానీయాలలో కెఫీన్, డైయూరిటిక్ గా ఉంటాయి. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది. వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.
 

Latest Videos

click me!