beard
ఈ రోజుల్లో యువత గడ్డాన్ని పెంచడం ఫ్యాషన్ గా మారింది. అందుకే యువకులు గడ్డాన్ని పెంచడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తారు. కొంతమందికి జన్యుపరంగా గడ్డం తక్కువగా ఉంటుంది. దీనికి తోడు తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా గడ్డం పెరగకుండా చేస్తాయి.
గడ్డం లేకుండా లుక్ పర్ఫెక్ట్ గా కనిపించదు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల గడ్డం పెరగకపోతే.. దీని గురించి మీరు వర్రీ అవ్వకండి. మీ ఆహారంలో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే మీ గడ్డం తిరిగి పెరగడం మొదలవుతుంది. మీ గడ్డం ఒత్తుగా పెరగడానికి ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ట్యూనా
మార్కెట్లో ఎన్నో రకాల చేపలు దొరుకుతాయి. ఈ రకాల చేపలన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ట్యూనా చేప ఒకటి. ఈ చేపను తింటే మీ గడ్డం పెరుగుదలను మెరుగుపడుతుంది. నిజానికి ట్యూనా చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హెయిర్ ఫోలికల్స్ ఏర్పడతాయి. అందుకే మీ గడ్డం, జుట్టు పెరుగుదల కోసం మీరు చేపలను తినొచ్చు.
pumpkin seeds
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ కూర చేసేటప్పుడు చాలా మంది వీటి గింజలను పారేస్తుంటారు. కానీ గుమ్మడికాయ గింజలు జుట్టు పెరుగుదలకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ గడ్డం జుట్టును పెంచాలనుకుంటే గుమ్మడికాయ విత్తనాలను తినండి. ఈ గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ అనే శక్తివంతమైన సూక్ష్మపోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయ గింజలను ఎండలో బాగా ఎండబెట్టి వేయించి ఉప్పుతో కలిపి తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.
Coconut Oil
కొబ్బరి నూనె
మీ గడ్డాన్ని పెంచాలనుకుంటే మీ ఆహారంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం స్టార్ట్ చేయండి. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల మీ గడ్డం పెరుగుదల మెరుగుపడుతుంది. ఈ విధంగా మీరు మీ గడ్డానికి సరైన రూపాన్ని ఇవ్వొచ్చు. ఇది కాకుండా కొబ్బరి నూనెతో మీ గడ్డాన్ని మసాజ్ చేయండి. ఇది మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తినడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు మూలాలలో రక్త ప్రవాహం మెరుగ్గా ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చిన చెక్క నీళ్లు కలుపుకుని తాగితే ఎంతో మంచిది.
పాలకూర
ఆరోగ్య దృష్ట్యా పాలకూర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని తీసుకోవడం వల్ల మీ గడ్డం మృదువుగా మారుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి గడ్డం జుట్టు బాగా పెరగాలంటే మీ డైలీ డైట్ లో వీటిని చేర్చుకోండి.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
జుట్టు ప్రోటీన్ తో తయారైన ఫైబర్. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఇది జుట్టుకు మంచిందని భావిస్తారు. మీ గడ్డం ఒత్తుగా ఉండటానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి. ఈ ఆహారాలలో గుడ్లు, కాయలు, సోయాబీన్, చిక్కుళ్ళు, బ్రోకలీ ఉన్నాయి.