banana
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అంతేకాదు.. ఎవరికైనా అరటిపండ్లు చాలా సులభంగా, తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. అలాంటి అరటి పండును మనం ఈ చలికాలంలో తినొచ్చా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
అరటి పండ్లలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అంతేకాదు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర వంటి విటమిన్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ ఎముక బలం పెంచడానికి, గుండె ఆరోగ్యం పెంచడానికి, ఎనర్జీ లెవల్స్ పెంచడానికి సహాయపడతాయి.
అరటి పండ్లలో ఉండే ఫైబర్ ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువగా సహాయపడుతుంది. చలికాలంలో సాధారణంగా అందరూ ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉంటారు. కాబట్టి.. అలాంటివారు అరటి పండు తినడం వల్ల... అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి... ఎలాంటి టెన్షన్ లేకుండా చలికాలంలోనూ అరటి పండ్లు తినొచ్చు.
అరటి పండ్లలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి... మన ఎముకలు బలపడటానికి కూడా సహాయపడతాయి. చలికాలంలో చల్లని గాలులు ఎముకల బలాన్ని తగ్గిస్తూ ఉంటాయి. అలాంటిప్పుడు ఈ అరటి పండ్లు తినడం వల్ల ఎముకల బలంగా మారతాయి.
అరటి పండ్లు.. తీసుకున్న వెంటనే మనకు శక్తిని అందిస్తాయి. ఈ చలికాలంలో.. మనకు ఎక్కువగా బద్దకంగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో అరటి పండ్లు తీసుకోవడం వల్ల మనకు వెంటనే ఎనర్జీ వస్తుంది. బద్దకాన్ని వెంటనే తరిమి కొట్టొచ్చు.
చాలా మంది మంచి నిద్రలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు సాయంత్ర వేళ ఒకటి లేదా.. రెండు అరటి పండ్లు తినాలి. ఇలా తింటే రాత్రిపూట చాలా మంచిగా నిద్రపడుతుంది. నిద్రలేని సమస్య నుంచి బయటపడొచ్చు. అరటిపండులో ఉండే మెగ్నీషియం ... మంచి నిద్రను అందించడానికి సహాయపడుతుంది.
దగ్గు, జ్వరం, ఆస్తమా లాంటి సమస్యలు ఉణ్నవారు తప్ప.. మిగిలినవారు అందరూ... నిస్సందేహంగా చలికాలంలోనూ అరటి పండ్లను ఆస్వాదించవచ్చు. అయితే.. చలికాలంలో అరటిపండు ను రాత్రిపూట మాత్రం తినకుంా ఉండటం మంచిది. సాయంత్రపూటతో ఆపేయవచ్చు. రాత్రిపూట తింటే.. నిద్రకు ఆటంకం కలుగుతుంది.