మీరు చికెన్ తినరా? ప్రోటీన్ కోసం వేటిని తినాలంటే?

First Published | May 30, 2024, 3:27 PM IST

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాల్లో చికెన్ ఒకటి. అయితే కొంతమంది చికెన్ ను అస్సలు తినరు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రోటీన్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఒక్క చికెన్ లోనే కాకుండా ఇంకా కొన్ని ఆహారాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అవేంటంటే?

chicken

మన శరీరానికి ప్రోటీన్ చాలా చాలా అవసరం. అందుకే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా శరీరానికి శక్తి అందుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారంగా ప్రతి ఒక్కరూ భావించే ఆహారంలో చికెన్ ఒకటి. కానీ చికెన్ మాత్రమే కాద  ప్రోటీన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Pulses

పప్పుధాన్యాలు

చిక్కుళ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల చిక్కుళ్లలో 9 గ్రాముల వరకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మీరు చికెన్ ను తినకుంటే పప్పు ధాన్యాలను తినండి. వీటి ద్వారా మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ను పొందుతారు. మాంసకృత్తులతో పాటుగా చిక్కుళ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
 


సాల్మన్ చేపలు

చేపల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ వంటి సముద్ర చేపల్లో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మిమ్మల్ని పుష్కలంగా ఉంటాయి.
 

Image: Getty Images

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు కూడా ప్రోటీన్ కు అద్బుతమైన వనరులు. వీటిలో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే మీరు చికెన్ ను తినకుండే పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను మీ డైట్ లో చేర్చుకోండి. 

బాదం

బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బాదం పప్పులో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బాదం పప్పులను శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

విత్తనాలు

చియా విత్తనాలు వంటి విత్తనాలలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇవి తిన్నా మీ శరీరం సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.
 

సోయాబీన్

100 గ్రాముల సోయాబీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే చికెన్ ను తినని వారు సోయాబీన్ ను తినొచ్చు. ఇది కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రోటీన్ ను అందించడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!