మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే...!

First Published May 30, 2024, 3:07 PM IST

కిడ్నీలో రాళ్లు కూడా అందులో భాగమే. అవి రాకుండా ఉండాలి అంటే.. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు మాత్రమే కాదు... ఈ కింది ఆహారాలు డైట్ లో భాగం చేసుకుంటే..  మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. 

kidney health

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే... మన శరీరంలోని అన్ని అవయవాలు మంచిగా పని చేయాలి. అందులో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా..  మనకు తిప్పలు మొదలైనట్లే. ఈ క్రమంలో.. మనం మన కిడ్నీల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కిడ్నీలో రాళ్లు కూడా అందులో భాగమే. అవి రాకుండా ఉండాలి అంటే.. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు మాత్రమే కాదు... ఈ కింది ఆహారాలు డైట్ లో భాగం చేసుకుంటే..  మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరి, ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం...

1.బెర్రీలు..

మీరు మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే... కచ్చితంగా బెర్రీలను డైట్ లో భాగం చేసుకోవాలి. అంటే స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు,  బ్లూ బెర్రీలను ఉదయాన్నే తీసుకోవాలి.  బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

Latest Videos


2.చేపలు..
నాన వెజ్ ప్రియులు... ఈ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపలను ఎంచుకోవచ్చు. చేపల్లోనూ సాల్మన్, ట్రౌట్ లాంటివి ఎంచుకోవచ్చు. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి
 

Leafy vegetables

3.ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు..

మన డైట్ లో ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు లాంటివి తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర,  క్యాబేజీ లాంటివి తీసకోవాలి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరాన్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్.. మన కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
 

4.లో ఫ్యాట్ డెయిరీ..
మాములగా అయితే డెయిరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఫ్యాట్ కలిగి ఉంటాయి. కానీ... యోగర్ట్ కానీ, ఫ్యాట్ లెస్ మిల్క్ లాంటివి ఎంచుకుంటే.. మంచిది. ఇవి కొడ్నీ సంబంధిత సమస్యలు రాకుండా మనల్ని ఎక్కువగా కాపాడుతూ ఉంటాయి. వీటిలో పొటాషియం, పాప్సరస్ తో పాటు.. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి.

5.కాఫీ..
మీరు నమ్మరు కానీ... మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి  ఒక కప్పు కాఫీ తాగితే చాలు.. మీ కిడ్నీలు సేఫ్ గా ఉన్నట్లే.
 

6.పప్పులు..
అన్ని రకాలు పప్పులు, దినసులు కూడా మన డైట్ లో భాగం చేసుకోవాలి. వాటిలో.. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందుకే.. ఓట్స్, బార్లీ, గోధుమలు, బ్రౌన్ రైస్, కినోవా లాంటివి కూడా మన డైట్ లో భాగం చేసుకోవాలి.

Image: Freepik

7.ఎర్ర మిరపకాయలు..
మనం సాధారణంగా కారం కోసం వాడతాం. కానీ... ఇది మనకు విటమిన్ సీ తో పాటు,, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.  కాబట్టి... ఎర్ర మిరపకాయలను వంటలో భాగం చేసుకోవచ్చు.

click me!