ఇంట్లోనే కమ్మని క్రిస్మస్ కేక్ ను ఇలా ఈజీగా తయారుచేయండి.. టేస్ట్ అదిరిపోతుందంతే..!

First Published | Dec 21, 2023, 11:25 AM IST

christmas 2023: ఈసారి మీరు క్రిస్మస్ సందర్భంగా మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే మాత్రం ఎంచక్కా నోరూరించే కేక్ నే తయారుచేయండి.ఈ కేక్ మీ పిల్లలకే కాదు మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఈ కేక్ ను తయారుచేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. దీన్ని చేయడం చాలా ఈజీ కూడా. 
 

christmas 2023: క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగించే పండుగ. ముఖ్యంగా పిల్లలు ఈ పండుగ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఎందుకంటే పిల్లలకి శాంటా తాత గిఫ్ట్ లను ఇస్తాడని భావిస్తారు. కానీ అందరి పిల్లలకు శాంటా నుంచి గిఫ్ట్ రాకపోవచ్చు. అయితేనేం తల్లిదండ్రులే పిల్లలకు వారికి నచ్చిన బహుమతులను ఇవ్వొచ్చు. మీరు ఇంట్లోనే క్రిస్మస్ పార్టీని చేస్తున్నట్టైతే మీ పిల్లలను సర్ ప్రైజ్ చేయొచ్చు. ఎలాగంటే పిల్లలకు చాక్లెట్స్ అన్నా.. కేక్ లన్నా చాలా ఇష్టపడతారు. కాబట్టి వీటిని బయటి నుంచి కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారుచేయొచ్చు. చాలా మంది కేక్ లను తయారుచేయడం ఎంతో కష్టమనుకుంటారు. కానీ వీటిని తయారుచేయడం చాలా సులువు. అవును ఈ క్రిస్మస్ కు బయట కొనకుండా ఇంట్లోనే కమ్మని క్రిస్మస్ కేక్ ను ఎలా తయారుచేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

christmas cake

చాక్లెట్ కేక్ 
కావాల్సిన పదార్థాలు

1 కప్పు- మైదా, 1 కప్పు- పంచదార పొడి, 1/2 కప్పు కోకో పౌడర్, అర కప్పు - వేడి నీరు, 1/2 కప్పు - చల్లటి పాలు, 1 టీస్పూన్- వెనీలా ఎసెన్స్, 2 టీస్పూన్లు - పెరుగు, చిటికె - ఈనో, 1 టీస్పూన్- బేకింగ్ పౌడర్, అర కప్పు- వెన్న.
 

Latest Videos


తయారుచేసే విధానం

చాక్లెట్ కేక్ ను తయారు చేయడానికి ముందుగా ఓవెన్ ను 180 డిగ్రీలకు ప్రీ-హీట్ చేయడానికి ఉంచండి. అలాగే కేక్ మేకర్ చుట్టూ నెయ్యిని అప్లై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో పిండి, పంచదార, కోకా పౌడర్, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత దీనిలో అరకప్పు వెన్న, అరకప్పు వేడినీళ్లు వేసి పిండిని బాగా కలపండి. ఆ తర్వాత పాలు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత  దీనిలో పెరుగు, మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపండి. ఇప్పుడు దీన్ని కేక్ మేకర్ లో పెట్టి 160 డిగ్రీల వద్ద 35-40 నిమిషాల పాటు బేక్ చేయండి.

40 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇందుకోసం కేక్ తో చెక్ చేయండి. కేక్ లో ఇది పెట్టినప్పుడు ఆ పిండి దీనికి అంటుకోకుండా బయటకు వెస్తే మీరు తయారుచేసిన కేక్ రెడీ అయినట్టే. మీరు కావాలనుకుంటే ఆ కేక్ పై చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ అయినట్టే. ఇంకెందుకు ఆలస్యం.. ఈ క్రిస్మస్ కు చాక్లెట్ కేక్ ను తయారుచేసి టేస్ట్ చేయండి.
 

నుటెల్లా మగ్ కేక్ 

కావాల్సిన పదార్థాలు

1/4 కప్పు - మైదా, 1/4 కప్పు- నుటెల్లా, 3 టీస్పూన్లు- పాలు, 1/4 టీస్పూన్- బేకింగ్ పౌడర్, 1. గుడ్డు (కావాలనుకుంటేనే), చెర్రీస్- గార్నిష్ కోసం స్ట్రాబెర్రీ జామ్ లేదా విప్డ్ క్రీమ్ (కావాలనుకుంటేనే), 

తయారుచేసే విధానం

ముందుగా నుటెల్లా, మైదా పిండిని బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు గుడ్లను వేయాలనుకుంటే ఈ పిండిలో గుడ్డు వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని ఎంత ఎక్కువగా కలిపితే మీ కేక్ అంత మృదువుగా మారుతుంది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు పాలు, బేకింగ్ వేసి పౌడర్ బాగా కలపండి. ఈ మిశ్రమంలో పిండి ముద్దులగా అస్సలు ఉండకూడదు. కావాలనుకుంటే మీరు దీన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్ సేఫ్ మగ్ లోకి వేయండి. అయితే ఈ మగ్ ను కొద్దిగా ఖాళీగా ఉంచండి. ఎందుకంటే కేక్ ఉబ్బుతుంది. 
 

cake

ఈ నెటెల్లా మగ్ కేక్ ను కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. దీన్ని ఎక్కువ సేపు లేదా తక్కువ సేపు మైక్రోవేవ్ లో ఉంచకూడదు. కానీ మైక్రోవేవ్ లో ఎక్కువసేపు ఉంచకూడదు. కేక్ రెడీ అయిన తర్వాత బయటకు తీసి స్ట్రాబెర్రీ జామ్, వెనీలా ఐస్ క్రీం లేదా మీకు నచ్చిన ఏదైనా టాపింగ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే.

click me!