రాత్రిపూట ఈ ఆహారాలను మాత్రం తినకండి.. ఒకవేళ తిన్నారో..!

First Published | Sep 17, 2023, 2:40 PM IST

రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే నిద్రకూడా సరిగ్గా పట్టదు. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. చెడు జీవనశైలి, అనారోగ్యకరమై ఆహారాలు వంటివి నిద్రలేమికి దారితీస్తాయి. కానీ రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్నో వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిపూట కొన్ని ఆహారాలను తింటే సరిగ్గా నిద్రపట్టదు. అవేంటంటే..? 

Image: Freepik

కెఫిన్

కెఫిన్ మన శరీరాన్ని చురుగ్గా చేస్తుంది. తక్షణమే ఎనర్జీని అందిస్తుంది. కానీ దీన్ని రాత్రిపూట మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే కెఫిన్ మన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కెఫిన్ కంటెంట్ కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాల్లో ఉంటుంది. అందుకే రాత్రిళ్లు వీటిని మాత్రం తాగకండి. 


spicy food

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి. కానీ వీటిని తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్ ను తిని పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే రాత్రి నిద్రపట్టకుండా చేస్తుంది. 
 

కొవ్వు ఆహారాలు

కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు రుచికరంగా అనిపిస్తాయి. అందుకే ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలు, చీజ్ లను ఎక్కువ మొత్తంలో తింటారు. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి అంత సులువుగా అరగవు. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపు అసౌకర్యంగా ఉంటుంది. దీంతో మీరు సౌకర్యంగా నిద్రపోలేరు.
 

కేకులు

రాత్రిపూట ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు కుకీలు, కేకులు, ఐస్ క్రీం వంటి స్వీట్లను తినడం మానుకోవాలి. ఎందుకంటే వీటిలో స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 
 

ఆయిలీ ఫుడ్

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, స్వీట్లు, చాక్లెట్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. చల్లని ఆహారం, ఐస్ క్రీం పెరుగు ఇవన్నీ రాత్రిపూట ఖచ్చితంగా నివారించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!